Mango leaves
సాధారణంగా మామిడి పండ్లు మనకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ మామిడి ఆకులు(Mango leaves) కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని చాలామందికి తెలియదు. పండుగలకు, శుభకార్యాలకు తోరణాలు కట్టడానికి మాత్రమే కాకుండా, ఈ ఆకుల్లో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ, బీ, సీతో పాటు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి మామిడి ఆకులు(Mango leaves) ఒక వరం లాంటివి. ఈ ఆకుల్లో ఉండే ఆంథోసైనిడిన్స్ అనే ప్రత్యేకమైన టానిన్లు మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తాయి. ఈ ప్రయోజనం పొందాలంటే, లేత మామిడి ఆకులను తీసుకొని వాటిని ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి, ఆ కషాయాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఆయుర్వేద చికిత్సలో కూడా బాగా వాడుతూ ఉంటారు.
అలాగే, కిడ్నీలో రాళ్లను నివారించడానికి కూడా మామిడి ఆకులు(Mango leaves) చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనికోసం, ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మామిడి ఆకుల పొడిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడపోసి తాగితే, అది మూత్రం ద్వారా కిడ్నీలోని రాళ్లను బయటకు పంపిస్తుంది.
రక్తపోటు (బీపీ) సమస్య ఉన్నవారు కూడా ఈ ఆకులను ఉపయోగించవచ్చు. మామిడి ఆకుల పొడిని నీటిలో కలిపి కషాయంగా సేవించడం వల్ల బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పొట్ట సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తాయి. దీంతో పాటు, ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.