Health
చాలా కాలంగా ఫిట్‌నెస్ లవర్స్ కేవలం ప్రోటీన్ చుట్టూ తిరిగేవారు. కండరాలు పెరగాలంటే ప్రోటీన్ ఒక్కటే మార్గం అనుకునేవారు. కానీ, 2026 నాటికి హెల్త్ పట్ల దృక్పథం మారుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో, హెల్త్ సర్కిల్స్‌లో చాలామంది దగ్గర ‘ఫైబర్ మాక్సింగ్’ (Fiber Maxxing) అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది.
ఫైబర్ మాక్సింగ్ అంటే మన ఆహారంలో పీచు పదార్థాన్ని (Fiber) ఎక్కువ స్థాయిలో పెంచడం. పేగుల ఆరోగ్యం (Gut Health) బాగుంటేనే మొత్తం శరీరం స్ట్రాంగ్‌గా ఉంటుందన్న అవగాహన పెరగడంతో ఈ కొత్త ట్రెండ్ ఊపందుకుంది.
మన శరీరంలో జీర్ణక్రియ సజావుగా సాగాలన్నా, చెడు కొలెస్ట్రాల్ తగ్గాలన్నా కూడా దానికి ఫైబర్ ఎంతో కీలకం. అయితే ‘మాక్సింగ్’ పేరుతో అతిగా పీచు పదార్థాన్ని తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఫైబర్ ఒక్కసారిగా పెంచితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు, ముఖ్యమైన ఖనిజ లవణాలు శరీరానికి అందకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే ఫైబర్ మాక్సింగ్ చేసేటప్పుడు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాల ద్వారా సహజంగా లభించే ఫైబర్‌ను క్రమంగా పెంచుకుంటూ వెళ్లడం సరైన విధానం. ఏదైనా సరే అతిగా కాకుండా సమపాళ్లలో తీసుకున్నప్పుడే అది మన శరీరానికి మేలు చేస్తుంది.
