Lips:ఆకర్షణీయమైన పెదవులు కావాలా..అయితే ఈ పొరపాట్లు చేయకండి..

Lips:పెదవులు పగలడానికి, వాటి సహజ రంగు మారడానికి ప్రధాన కారణం సరైన సంరక్షణ లేకపోవడమే.అందుకే దానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

Lips

మనం ఎంత అందంగా ఉన్నా, పగిలిన, పొడిబారిన పెదాలు (lips)మన ముఖంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. పెదవులు పగలడానికి, వాటి సహజ రంగు మారడానికి ప్రధాన కారణం సరైన సంరక్షణ లేకపోవడమే. పెదవులపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే దానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

పెదవులు(lips) పగలడానికి ప్రధాన కారణం శరీరానికి తగినంత హైడ్రేషన్ లేకపోవడం. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజూ కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే, విటమిన్-బి, ఐరన్ ,ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పెదవులకు పోషణ లభిస్తుంది. ఆకుకూరలు, పప్పులు, పండ్లు, గుడ్లు మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల పెదాలు ఆరోగ్యంగా ఉంటాయి.

సహజసిద్ధమైన స్క్రబ్స్, ప్యాక్స్..

lips

పెదవులపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడానికి వారానికి ఒకసారి స్క్రబ్ చేయడం చాలా అవసరం.ఒక స్పూన్ చక్కెరలో కొద్దిగా తేనె కలిపి పెదాలపై సున్నితంగా రుద్దాలి. తేనెలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు, చక్కెరలోని సున్నితమైన కణాలు డెడ్ సెల్స్‌ను తొలగించి, పెదాలను మృదువుగా, తాజాగా ఉంచుతాయి.
రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను పెదాలకు రాసుకుంటే, అవి పొడిబారకుండా ఉంటాయి. అలాగే, బాదం నూనెను వాడటం వల్ల పెదవుల నలుపు తగ్గి, అవి సహజ రంగులోకి వస్తాయి.

రోజు మొత్తం పెదాలను మాయిశ్చరైజ్ చేయడానికి లిప్‌బామ్ వాడాలి. ముఖ్యంగా, బయటికి వెళ్లేటప్పుడు ఎస్పీఎఫ్ (SPF) ఉన్న లిప్‌బామ్‌ను వాడటం వల్ల సూర్యరశ్మి నుండి పెదాలను రక్షించుకోవచ్చు. పెదాలను నాలుకతో తడపడం వల్ల అవి తాత్కాలికంగా మృదువుగా అనిపించినా, ఉమ్మిలోని ఎంజైమ్స్ పెదాలపై ఉన్న తేమను లాగేసి, వాటిని మరింత పొడిగా మార్చుతాయి.

కారంగా ఉండే ఆహారం వల్ల కూడా పెదాలు (lips)పగిలి, ఎర్రగా మారతాయి. అందుకే స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి.లిప్‌స్టిక్‌తో నిద్రపోవడం వల్ల పెదాలు పొడిబారి, వాటి సహజ రంగును కోల్పోతాయి. రాత్రి పడుకునే ముందు లిప్‌స్టిక్‌ను పూర్తిగా తొలగించాలి.ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, మీ పెదాలు అందంగా, మృదువుగా, ఆరోగ్యంగా ఉంటాయి.

Darshan: జైలులో కష్టాలు పడుతున్న స్టార్ నటుడు.. కోర్టు ముందు ఆవేదన

Exit mobile version