Darshan: జైలులో కష్టాలు పడుతున్న స్టార్ నటుడు.. కోర్టు ముందు ఆవేదన
Darshan: ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దర్శన్, కోర్టులో తాను పడుతున్న కష్టాలను కోర్టు ముందు వెళ్లబోసుకున్నారు.

Darshan
ప్రజాదరణ, సంపద , హోదా ఉన్న సెలబ్రిటీలు చేసే తప్పులు ప్రజల దృష్టిలో త్వరగా నిలబడతాయి. అయితే, న్యాయం దృష్టిలో మాత్రం వారందరూ సామాన్యులే. ఇటీవల కన్నడ నటుడు దర్శన్(Darshan) జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు ఈ సత్యాన్ని మరోసారి రుజువు చేశాయి. ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దర్శన్, కోర్టులో తాను పడుతున్న కష్టాలను వెళ్లబోసుకున్నారు.
బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో దాదాపు 30 రోజులకు పైగా ఉన్న దర్శన్(Darshan), తనను తాను రక్షించుకోవడానికి కోర్టుకు తన ఆవేదన విన్నవించుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరైన దర్శన్, తాను సూర్యకాంతి చూడలేదని, తన చేతుల్లో ఫంగస్ పెరిగిందని, బట్టలు దుర్వాసనతో ఉన్నాయని వాపోయారు. ఈ పరిస్థితుల్లో బతకడం అసాధ్యం, దయచేసి నాకు విషం ఇవ్వండి అని కోర్టును వేడుకున్నారు. అయితే, న్యాయమూర్తి “అలాంటివి చేయడం సాధ్యం కాదు. నియమా ప్రకారం మీ సమస్యలను జైలు అధికారులు పరిష్కరిస్తారని చెప్పారు.

దర్శన్(Darshan)కు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే రద్దు చేసింది. “ఎలాంటి ప్రత్యేక సదుపాయాలూ ఇవ్వవద్దు” అని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సెలబ్రిటీ హోదా ఉన్నా కూడా, చట్టం ముందు అందరూ సమానమే అని ఈ నిర్ణయం చాటిచెప్పింది. ఒక వ్యక్తి తన ప్రజాదరణను, సంపదను, అధికారాన్ని ఉపయోగించి చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు, అతనికి ఎలాంటి మినహాయింపు ఉండదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ కేసు వెనుక ఉన్న సంఘటనలు కూడా చాలా షాకింగ్. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy)ని దర్శన్ బృందం కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ హత్యకు కారణం, రేణుకాస్వామి దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపడమేనని పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్శన్‌తో పాటు 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఎంత పెద్ద నేరమో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఈ కేసు సెలబ్రిటీలకు ఒక పెద్ద హెచ్చరిక. ఎంత పేరున్న వ్యక్తి అయినా, చట్టానికి లోబడి ఉండాలి.
One Comment