Just LifestyleHealthLatest News

Physical Activity:10 మందిలో ఒకరే వ్యాయామం ..ఆరోగ్యంపై భారతీయుల నిర్లక్ష్యం ఎందుకు?

Physical Activity:ఉరుకుల పరుగుల జీవితంలో మన అందరం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నాం.

Physical Activity

ఉరుకుల పరుగుల జీవితంలో మనమందరం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నాం. ఏసీ గదులు, గంటల కొద్దీ కూర్చుని చేసే ఉద్యోగాలు మన శరీరానికి సౌకర్యాన్ని ఇస్తున్నాయేమో కానీ, లోపల మాత్రం మన ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయి.

తాజాగా ఓ ప్రైవేట్ సంస్థ చేసిన సర్వే ప్రకారం, ప్రతి పదిమంది భారతీయుల్లో ఒక్కరు మాత్రమే రెగ్యులర్‌గా యోగా, ఎక్సర్‌సైజ్ వంటివి చేస్తున్నారు. అంటే మిగిలిన తొమ్మిది మంది తమ భవిష్యత్తులో ఏదో ఒక అనారోగ్య సమస్యకు ఆహ్వానం పలుకుతున్నట్లే  అన్నమాట.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ 12.4 శాతంతో, 11.8 శాతంతో తెలంగాణ రాష్ట్రం వ్యాయామం విషయంలో చాలా వెనుకబడి ఉన్నట్లు తేలింది. దీని ఫలితమే ఇప్పుడు హైదరాబాద్ వంటి నగరాల్లో దాదాపు 47% మంది ఒబెసిటీతో బాధపడుతున్నారు.

అందులోనూ పురుషుల కంటే మహిళలే ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని ఈ లెక్కలు చెబుతున్నాయి.ఒబెసిటీ ఒకటే అని కాదు డయాబెటిస్, థైరాయిడ్, బీపీ వంటి సమస్యలు కూడా వ్యాయామాలు లేకపోవడంతో మరింత పెరుగుతున్నాయి.

అయితే చాలామంది ఉద్యోగం చేసిన మహిళల నుంచి, గృహిణుల వరకూ పొద్దున్నుంచి ఇల్లు ఊడ్చడం, వంట చేయడం, పిల్లల వెనుక పరిగెత్తడం, ఆఫీసులకు ఉరుకుల పరుగుల మీద పరిగెత్తడం ఇదంతా శారీరక శ్రమ(Physical Activity) కాదా? అని ఆలోచిస్తున్నారు. నిజానికి అది ఒక పని, అలసట మాత్రమే, వ్యాయామం మాత్రం కాదన్న విషయాన్ని మర్చిపోతున్నారు.

నిజానికి వ్యాయామమనేది కేవలం బరువు తగ్గడానికి కాదు, గుండె ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి కూడా అవసరం అని గుర్తించండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకోగలరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చేద్దాంలే, రేపు చూద్దాములే అనే ప్రోక్రాస్టినేషన్ (వాయిదా వేయడం) వదిలేయాలి.

కుటుంబ బాధ్యతల మధ్య ఎక్సర్‌సైజులు చేసే సమయం దొరకడం లేదని బాధపడే వారికోసం కొన్ని చిన్న చిట్కాలు ఇప్పుడు చూద్దాం. రాత్రి పడుకునే ముందే రేపటి పనులన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. రోజూ కంటే ఒక 30 నిమిషాలు ముందుగానే నిద్రలేవడానికి ప్రయత్నించండి. ఆ సమయాన్ని మీ వ్యాయామానికి కేటాయించండి.

అలాగే పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించడానికి వెళ్లినప్పుడు లేదా కూరగాయలకు వెళ్లినప్పుడు కాస్త వేగంగా నడవండి. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూర్చుని మాట్లాడటం కాకుండా అటు ఇటు పచార్లు చేయండి.

Physical Activity
Physical Activity

సాయంత్రం వేళల్లో పిల్లలతో కలిసి పార్కుకు వెళ్లడం లేదా వారితో కలిసి ఆటలు ఆడటం వల్ల మీకు తెలియకుండానే వ్యాయామం పూర్తవుతుంది.

ఆఫీసులోనూ ,వివిధ పనుల కోసం వెళ్లినపుడు లిఫ్ట్ కు బదులు మెట్లు వాడటం అలవాటు చేసుకోండి. టీవీ చూస్తున్నప్పుడు కూడా సోఫాలో కూర్చోకుండా చిన్నపాటి స్ట్రెచింగ్స్ , యోగాసనాలు వేయడం అలవాటు చేసుకోవాలి.

శారీరక శ్రమ(Physical Activity) లేకపోవడం వల్లే రక్తపోటు (High BP), టైప్-2 డయాబెటిస్, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు తరచూ చెబుతూ ఉంటారు. అంతేకాదు ఎక్సర్‌సైజులు, యోగా వంటివి చేయని వారిలో డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశం కూడా 35% ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.

ఆరోగ్యం అనేది మనకోసం మనం సంపాదించుకునే అతిపెద్ద ఆస్తి అని తెలుసుకోవాలి. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు చెమట పట్టేలా ఏదో ఒక వ్యాయామం ,వాకింగ్, యోగా, సైక్లింగ్ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button