No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ..పేరుకే ఉచితం కానీ నిజం వేరు!

No Cost EMI: ఈ ఆఫర్లు వినియోగదారులను అనవసరమైన కొనుగోళ్లకు ప్రోత్సహిస్తాయి. వాయిదా చెల్లింపులు తక్కువగా ఉంటాయి అనే భావనతో మనం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి వెనుకాడం.

No Cost EMI

పండగలు వస్తే చాలు, ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ మార్కెట్‌లలో ‘నో కాస్ట్ ఈఎంఐ’ ఆఫర్లు వెల్లువెత్తుతాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు వాడే ఈ పదం నిజంగానే ఎలాంటి అదనపు ఖర్చులూ లేకుండా వాయిదాలలో వస్తువులు కొనే అవకాశం ఇస్తుందా? బయటకు ఉచితంగా కనిపించే ఈ పథకం వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘నో కాస్ట్ ఈఎంఐ(No Cost EMI)’ అంటే ఏంటంటే..నో కాస్ట్ ఈఎంఐ అంటే మనం ఒక వస్తువును కొన్నప్పుడు, దాని పూర్తి ధరను ఎలాంటి అదనపు వడ్డీ లేకుండా నెలవారీ వాయిదాలుగా చెల్లించడం. ఇది వినడానికి చాలా లాభదాయకంగా అనిపిస్తుంది. అయితే, ఆర్థిక నిపుణులు దీనిపై హెచ్చరిస్తున్నారు. ఈ పథకం నిజానికి పూర్తిగా ఉచితం కాదని, పరోక్షంగా కొన్ని ఖర్చులు వినియోగదారుడిపై పడతాయని చెబుతున్నారు.

ఏ వ్యాపార సంస్థా ఉచితంగా రుణం ఇవ్వదు. ఈ ఆఫర్‌ను ఇచ్చే సంస్థలు వడ్డీని ఇతర మార్గాలలో వసూలు చేస్తాయి. అవి ఈ కింది విధంగా ఉంటాయి.వస్తువు ధరలో వడ్డీని కలపడం.. సాధారణంగా, ‘నో కాస్ట్ ఈఎంఐ(No Cost EMI)’ ద్వారా కొనే వస్తువుల ధర, డిస్కౌంట్లు లేకుండా కొనే ధర కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఫోన్ క్యాష్ డిస్కౌంట్‌తో రూ. 30,000 కు లభిస్తే, అదే ఫోన్ నో కాస్ట్ ఈఎంఐలో రూ. 33,000 కు అందుబాటులో ఉండొచ్చు. ఈ అదనపు మొత్తమే అసలు వడ్డీ.

ప్రాసెసింగ్ ఫీజులు..చాలా బ్యాంకులు , ఫైనాన్షియల్ సంస్థలు ఈఎంఐని ఆమోదించడానికి ఒక ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. ఇది వినియోగదారునికి అదనపు భారం.అలాగే జీఎస్టీ, ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ, లేదా ఇతర సర్వీసులపై జీఎస్టీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కంటికి కనిపించని మరో ఖర్చు.

No Cost EMI

ఆర్థిక నిపుణులు నో కాస్ట్ ఈఎంఐ(No Cost EMI) ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, ఈ ఆఫర్లు వినియోగదారులను అనవసరమైన కొనుగోళ్లకు ప్రోత్సహిస్తాయి. వాయిదా చెల్లింపులు తక్కువగా ఉంటాయి అనే భావనతో మనం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి వెనుకాడం. ఇది దీర్ఘకాలంలో మన పొదుపు ప్రణాళికలను దెబ్బతీస్తుంది.

పండగ ఆఫర్లలో షాపింగ్ చేసేటప్పుడు ఈ కింది జాగ్రత్తలు తప్పనిసరి.వస్తువుల ధర పోల్చి చూడాలి. మీరు కొనాలనుకుంటున్న వస్తువు ధరను క్యాష్ డిస్కౌంట్‌తో ఉన్న ధరతో , నో కాస్ట్ ఈఎంఐ ధరతో పోల్చి చూడాలి.

నిబంధనలు చదవాలి. ఎందుకంటే ప్రతి నో కాస్ట్ ఈఎంఐ పథకానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. వడ్డీ రహిత కాలం ఎంత, ఆ తర్వాత వడ్డీ రేటు ఎంత, జరిమానా ఛార్జీలు ఉన్నాయా లేదా అని వివరంగా చదవాలి.

మీ ఆదాయానికి సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఈఎంఐ చెల్లింపులు మీ నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేయకుండా చూసుకోండి.ఆఫర్లు ఉన్నాయని అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకూడదు. మీకు నిజంగా అవసరమైన వస్తువులను మాత్రమే కొనాలి.పండగ సీజన్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం అనవసరమైన ఆర్థిక భారం నుంచి తప్పించుకుని, తెలివైన కొనుగోళ్లు చేయొచ్చు.

Vande Bharat: వందే భారత్ రైలులో ఇకపై పడుకొనే ప్రయాణించొచ్చు.. ఈనెలలోనే ప్రారంభం

Exit mobile version