Bhakarwadi: పుణే స్పెషల్.. బాకరవడి ఎప్పుడయినా టేస్ట్ చేశారా?

Bhakarwadi: కొబ్బరి తురుము, నువ్వులు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా చక్కెర , నిమ్మ ఉప్పు కలిపి పౌడర్‌లా తయారు చేస్తారు.

Bhakarwadi

మీరు ఏదైనా ఒక ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు, ఆ ప్రాంతం గుర్తుకు వచ్చే ఫుడ్ ఐటెమ్స్ కొన్ని ఉంటాయి. మహారాష్ట్రలోని ముఖ్యంగా పుణే (Pune) నగరం అంటే వెంటనే గుర్తొచ్చే స్నాక్ ఐటెమ్..బాకరవడి (Bhakarwadi). ఇది కేవలం స్నాక్ మాత్రమే కాదు, ఆ ప్రాంత సంస్కృతిని, అక్కడి రుచులను మనకు పరిచయం చేస్తుంది.

బాకరవడి (Bhakarwadi)అనేది ఒక స్పైసీ ,స్వీట్ రుచులు కలిసిన, క్రిస్పీగా ఉండే డీప్-ఫ్రైడ్ స్నాక్. దీనిని తయారుచేయడం చాలా కళాత్మకమైన ప్రక్రియ. ముందుగా మైదా మరియు శనగపిండి కలిపి, కొద్దిగా మసాలాలు, పసుపు వేసి పిండిని ముద్దలా చేస్తారు. ఈ పిండిని చపాతీలాగా పల్చగా రోల్ చేసి, దానిపై మసాలా మిశ్రమాన్ని సమానంగా పరుస్తారు.

Bhakarwadi

ఆ మసాలా మిశ్రమంలోనే బాకరవడి అసలు మ్యాజిక్ ఉంటుంది. కొబ్బరి తురుము, నువ్వులు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా చక్కెర , నిమ్మ ఉప్పు కలిపి పౌడర్‌లా తయారు చేస్తారు. ఈ మిశ్రమం కొద్దిగా తీపిగా, కొద్దిగా కారంగా, కొద్దిగా పుల్లగా ఉంటుంది. పిండిపై ఈ మసాలాని చల్లిన తర్వాత, దాన్ని చాలా గట్టిగా రోల్ చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఈ ముక్కలు చూడటానికి చిన్న స్పైరల్స్ (చుట్టలు) లాగా కనిపిస్తాయి.

కట్ చేసిన ఈ చిన్న ముక్కలను మళ్లీ నూనెలో నెమ్మదిగా, బంగారు రంగులోకి మారేవరకు డీప్ ఫ్రై చేస్తారు. అందుకే అవి చాలా క్రిస్పీగా (Crispy) ఉంటాయి. దీనిని టీతో పాటు సాయంకాలం స్నాక్ గా లేదా ట్రెయిన్ ప్రయాణాల్లో ప్యాక్ చేసుకునే డ్రై స్నాక్ గా బాగా ఇష్టపడతారు. దీనికి ప్రత్యేకంగా పుణేలో ఉన్న డిమాండ్ వల్లే, ఇది దేశమంతా పాపులర్ అయింది.

దీన్ని ఒకసారి తింటే, ఆ తీపి, కారం, పులుపు కలయిక మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. బాకరవడిఅంటే పుణే, పుణే అంటే బాకరవడి అన్నంతలా ఈ రెండూ కలిసిపోయాయి. సెలబ్రెటీలు కూడా ఈ బాకరవడిని ఇష్టంగా తింటారు.

Depression:ఒంటరిగా ఉండాలనిపించడం డిప్రెషనా? లేక మీ బ్రెయిన్ ఇచ్చే సెల్ఫ్-కేర్ సిగ్నలా?

Exit mobile version