HealthJust LifestyleLatest News

Depression:ఒంటరిగా ఉండాలనిపించడం డిప్రెషనా? లేక మీ బ్రెయిన్ ఇచ్చే సెల్ఫ్-కేర్ సిగ్నలా?

Depression: ఒంటరిగా ఉండాలనిపించడం చాలా సందర్భాల్లో బలహీనత కాదు, అది మన బ్రెయిన్ ఇచ్చే సెల్ఫ్-కేర్ సిగ్నల్

Depression

ఎప్పుడో ఒకసారి ఎవ్వరితోనూ మాట్లాడాలనిపించదు. ఫోన్ మోగినా తీసుకోకూడదు అనిపిస్తుంది. బయటికి వెళ్లాలనిపించదు. నన్ను కాస్త ఒంటరిగా ఉండనివ్వండి అన్న భావన లోపల నుంచి వస్తుంది. అప్పుడు చాలా మందికి భయం మొదలవుతుంది.. నాకు ఏదైనా సమస్య వచ్చిందా? ఇది డిప్రెషన్‌(Depression)కి మొదటి సంకేతమా? అని. కానీ సైకాలజీ (Psychology) చెప్పే నిజం దీనికి భిన్నంగా ఉంటుంది. ఒంటరిగా ఉండాలనిపించడం చాలా సందర్భాల్లో బలహీనత కాదు, అది మన బ్రెయిన్ ఇచ్చే సెల్ఫ్-కేర్ సిగ్నల్ (Self-Care Signal).

మన బ్రెయిన్ (Brain) రోజంతా చాలా విషయాలు మోయాలి. మనుషుల మాటలు, వర్క్ ప్రెజర్, కుటుంబ బాధ్యతలు, సోషల్ మీడియా నాయిస్, ఇతరులతో పోలికలు, నెగటివిటీ (Negativity)—ఇవి అన్నీ కలిపి మెదడును బాగా అలసిపోయే(Depression)లా చేస్తాయి. అప్పుడు బ్రెయిన్ కోరుకునేది ఒక్కటే.. కాస్త నిశ్శబ్దం కావాలి. ఆ నిశ్శబ్దమే ఒంటరితనం (Solitude).

సైకాలజీ ప్రకారం, ప్రతి మనిషికి రెండు రకాల ఎనర్జీ (Energy) అవసరం. ఒకటి ఇతరులతో ఉండటం వల్ల వచ్చే ఎనర్జీ (ఎక్స్‌ట్రావర్షన్). ఇంకొకటి తనతో తానే ఉండటం వల్ల వచ్చే ఎనర్జీ (ఇంట్రావర్షన్). ఈ రెండూ బ్యాలెన్స్ (Balance) కాకపోతే మనసు గందరగోళంగా మారుతుంది. అందుకే కొన్నిసార్లు మనం మనకు ఇష్టమైన వాళ్లకే దూరంగా ఉండాలనిపిస్తుంది.

Depression
Depression

ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాను అర్థం చేసుకోవాలి. ఒంటరిగా ఉండాలనిపించడం (Wanting to be alone) అనేది ఒంటరిగా ఫీలవడం (Feeling Lonely) కాదు. ఒంటరిగా ఉండాలనిపించడం అంటే మనసు రీచార్జ్ కావాలని కోరుకుంటోంది. ఒంటరిగా ఫీలవడం (Depression)అంటే మనసు బాధపడుతోంది. ఈ రెండింటిని చాలా మంది కలిపేస్తారు. అలా కలిపేస్తేనే సమస్య మొదలవుతుంది.

మనతో మనమే ఉండే టైమ్‌లోనే మనకు నిజమైన క్లారిటీ (Clarity) వస్తుంది. నేను ఏం చేస్తున్నాను?, నాకు నిజంగా కావాల్సింది ఏంటి?, ఎవరితో ఉండాలి, ఎవరితో దూరంగా ఉండాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు అప్పుడే దొరుకుతాయి. అందుకే చాలా మంది సక్సెస్ (Success) అయినవాళ్లు ఒంటరిగా గడిపిన టైమ్‌కి ఎక్కువ విలువ ఇస్తారు.

కానీ ఇక్కడ ఒక సరిహద్దు (Line) గీసుకోవాలి. ఒంటరిగా ఉండాలనిపించడం నార్మల్ (Normal). కానీ రోజుల తరబడి ఎవ్వరితోనూ మాట్లాడాలనిపించకపోతే, ఏ పని మీద ఆసక్తి (Interest) లేకపోతే, ఎప్పుడూ అలసటగా అనిపిస్తే మాత్రం అది ప్రమాదపు సిగ్నల్. అప్పుడు ఒంటరితనం కాదు, సహాయం అవసరం అని గుర్తించాలి.

మనసు కోరే ఒంటరితనాన్ని గౌరవించాలి. మనసు లోపలికి వెళ్లిపోతుంటే మాత్రం అర్థం చేసుకోవాలి. కొంతకాలం మనతో మనమే ఉండి మనల్ని తిరిగి కనుక్కోవడం (Rediscover) అనేది చాలా మంచి విషయం. ఒంటరితనం మనకు శత్రువు కాదు. దాన్ని అర్థం చేసుకోకపోవడమే అసలు ప్రమాదం.

Anger:కోపం వైపు మనసు ఎందుకు పరుగెడుతుంది? కోపాన్ని కంట్రోల్ చేసే అంతరంగ రహస్యం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button