
Literature: అమిగోస్
Friendship: అమిగోస్
వాళ్లేమీ
ఉదయించే సూరీడో
ప్రకాశించే చంద్రుడో
ఎగిసి పడే సంద్రమో
ప్రవహించే నదో కాదు…
కానీ వారిని చూడగానే
మనసు ఉప్పొంగిపోతుంది
కాలం భూత,భవిష్యత్తులను
వర్తమానంలోకి తెచ్చేస్తుంది
వాళ్లు పురాతత్వ శాస్త్రవేత్తలా
జ్ఞాపకాలను తవ్వేస్తుంటే
వాళ్ల స్మృతికి విస్మయం చెందుతాము..
ఈ ప్రపంచం గుర్తించని
ఎనిమిదో అద్భుతం వాళ్లు..
ఆ మాటకొస్తే వాళ్లే
మొట్టమొదటి అద్భుతం..
మనల్ని కాలంలో ప్రయాణింపజేసే
ఏకైక సాధనం వాళ్లే…
మనకు తెలిసిన మొట్టమొదటి
మానసిక వైద్యులు వాళ్లే..
మన గుండె చెరువయితే
తడిచే తొలి చెయ్యి వాళ్లదే…
మన కన్నీళ్లకు ఆనకట్ట కట్టేది వాళ్లే..
మన నవ్వులను రెట్టించేది వాళ్లే..
వాళ్లంటే
పదాలు లేని పాట
వర్ణనలు లేని కవిత
రంగులద్దని చిత్రం
స్వర పరచని సంగీతం …
మనల్ని అలరించేది వాళ్లే..
మనల్ని మురిపించేది వాళ్లే..
వాళ్లతో మాట్లాడితే
హృదయం పూలవనంలో
సీతాకోక చిలుకలా విహరిస్తుంది..
వాళ్లతో పోట్లాడితే
అద్దంలో చూస్తూ
యుద్ధం చేస్తున్నట్టుంటుంది
ఉత్సాహానికి మరో రూపు వాళ్లు
ప్రోత్సాహానికి పర్యాయపదం వాళ్లు
వాళ్లు వార్తాపత్రిక లాంటోళ్లు
వాళ్లు విహారయాత్ర లాంటోళ్లు
స్నేహితులు..మిత్రులు..నేస్తాలు
ఎలా అంటేనేం..
దోస్త్, నన్బన్, అమిగో
ఏ భాషలో పిలిస్తేనేం..
ఆసాంతం మన సొంతవాళ్లు వాళ్లే..
వాళ్లకు ఇవ్వాల్సింది కానుకలు కాదు
కాసింత సమయం… కాసింత హృదయం..
——ఫణి మండల

Also read: For More Literature
Very nice
Excellent
Nice
Excellent 👌👌👌
ఫణి మండల గారు మనకి మన స్నేహితులతో ఉండే అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు.ప్రతి విషయంలో మన తోడుగా ఉండేవాడే స్నేహితుడు అని చెప్పారు.మీకు ధన్యవాదాలు మంచి సాహిత్యం అందించినందుకు.
Super
Amigos kavitha chala bagundi natural ga undi,chaduvutunte inka bagundi.aalochiste. Inka inka…… bagundi
Super
Super phani
హృదయానికి హత్తుకుంది. స్నేహ మధుర్యాన్ని, గొప్పతనాన్ని చెప్పారు.
Adbhutam…
Tammu very nice your wonderful words
Very nice bava.