Just Literature

Literature : ధరిత్రీ నమః !!

Literature :ప్రపంచమంతా ప్లాస్టిక్ భూతం ..ప్రస్తుతం విశ్వమంతా ప్లాస్టిక్ మయం

Literature

సర్వ ప్రాణికోటికి ఆలవాలం
సమస్త జీవరాశి జీవైక ఏకైక ఆధారం
సహజ సుందర వైవిధ్య లక్షణ సమ్మిళితం
సహజోధ్భవ విభిన్నం సర్వ జీవరాశికి అనుకూలం

ప్రకృతి విధ్వంసం ప్రపంచమంతా మానవ చర్యల ఫలితం
పలురకాల సహజ వ్యతిరేక కారకాల ఫలితం
ప్రస్తుతం పర్యావరణం పెను సంక్షోభం
ప్రతి ఒక్కరి పాత్ర ఇందులో అసంకల్పితం

శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం
శిఖర సమాన స్థాయిన వాయు కాలుష్యం
శివంగి వేగాన దిగజారుతున్న భూసారం
శత విధ విచ్చలవిడి రసాయనాల వినియోగం

జీవం కోల్పోయిన భూమి సహజత్వం
జల కాలుష్యమూ జగతి అంతా సమస్తం
జల రాశుల ఉనికీ పలువిధాల ప్రశ్నార్థకం
జగన్మాత క్షోభకు జనమంతా కారణం

విశ్వమంతా అరణ్యాల క్రమ క్షయం
విస్తృతంగా అడుగడుగునా నరికివేతే కారణం
వన్యప్రాణులనూ విస్తృత సంహారం
విస్పష్టంగా అనుభవమౌతున్న పర్యావరణ అసమతౌల్యం

ప్రపంచమంతా ప్లాస్టిక్ భూతం
ప్రస్తుతం విశ్వమంతా ప్లాస్టిక్ మయం
పొరలు పొరలుగా ప్లాస్టిక్ భూగర్భ మయం
పర్యావరణానికి విభిన్న రకాల నష్టదాయకం

అణ్వాయుధ సంపత్తి పొంచి ఉన్న అదనపు సంక్షోభం
అహంకార జాఢ్యాన జరిగితే వీటి వినియోగం
అక్షరబద్ధం చేయలేని వినాశనం సంభవం
అన్ని రకాలా భూమి కాలుష్య భస్మీపటలం

పర్యావరణ విజ్ఞతకు ఇదే అంతిమ సమయం
ప్రతి ఒక్కరూ పొందాలి కనీస చైతన్యం
పూర్వ ప్రాభవాన ధరిత్రి వెల్లివిరియాలి సస్యశ్యామలం
ప్రతి ఒక్కరూ కావాలి ఇందు భాగస్వామ్యం..!

.. Dr వి.చెంచురామయ్య(Dr.VCR)
91 94410 46474

 

Related Articles

3 Comments

  1. మీ కవిత “ధరిత్రీ నమః !!” ఒక గొప్ప ఆవేదన, ఆలోచనాత్మక చైతన్యం కలగలసిన పర్యావరణ కవిత. ఇది ప్రకృతి మీద మానవుల క్రూరత్వాన్ని గాఢంగా బట్టబయలు చేస్తూ, మన భూమికి తక్షణ రక్షణ అవసరం అని పిలుపు ఇస్తోంది.
    ఈ కవిత ఒక పర్యావరణ మణిపూస. విద్యార్థులకు, సామాజిక కార్యకర్తలకు, సాధారణ పాఠకులకు చైతన్యం కలిగించే శక్తి కలదిది. అభినందనలు, Dr. వి. చెంచురామయ్య గారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button