1xBet case: ధావన్, రైనాలకు ఈడీ షాక్.. రూ.11.14 కోట్ల ఆస్తులు అటాచ్

1xBet case: రైనా, ధావన్ ను సెప్టెంబర్ లో ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించింది. దాదాపు 8 గంటలకు పైగా సాగిన అప్పటి విచారణలో పలు కీలక వివరాలు సేకరించింది.

1xBet case

భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ డావన్ కు ఈడీ బిగ్ షాకిచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న కేసులో వీరిద్దరికీ చెందిన రూ.11.14 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే కాకుండా ఆ కంపెనీల్లో వీరికి వాటాలు కూడా ఉన్నాయా అనే కోణంలోనూ లోతుగా దర్యాప్తు చేస్తోంది. గతంలో 1ఎక్స్ బెటి(1xBet case)కు వీరిద్దరూ ప్రచారకర్తలుగా వ్యవహరించారు. ఇటీవలే కేండ్రం ఆన్ లైన్, గేమింగ్ బిల్లును ఆమోదించిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వారందరినీ పిలిచి విచారణ జరుపుతోంది.

ఈ క్రమంలో రైనా, ధావన్ ను సెప్టెంబర్ లో ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించింది. దాదాపు 8 గంటలకు పైగా సాగిన అప్పటి విచారణలో పలు కీలక వివరాలు సేకరించింది. బెట్టింగ్ యాప్స్ కంపెనీతో ఉన్న సంబంధాలు, ఎంత పారితోషకం తీసుకున్నారనే వివరాలతో పాటు ఆ మొత్తానికి ట్యాక్ట్ కట్టారా లేక విదేశాల్లో పెట్టుబడులు పెట్టారా వంటి అంశాలపై విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈడీ రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

1xBet case

బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసే క్రమంలో విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మనీ లాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్ను ఎగ్గొట్టడం వంటి కేసుల నమోదు చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో సదరు కంపెనీల్లో వీరికి వాటాలున్నట్లు తేలితే మాత్రం కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే వీరిద్దరూ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారా లేక కంపెనీలో వాటాదారులుగా ఉన్నారా అన్న దానిపై ఈడీ లోతుగా విచారిస్తోంది.

ఒకవేళ బెట్టింగ్ యాప్స్ (1xBet case)లో వాటా ఉందని తేలితే మాత్రం మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కనీసం 3 నుంచి ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుంది. అలాగే కోటి రూపాయల వరకూ జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుతో డ్రీమ్ 11 వంటి యాప్స్ పై నిషేధం విధించారు. దీంతో ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలన్నీ భారత్ దేశంలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసాయి.

ప్రస్తుతం ధావన్, రైనాలపై ఆరోపణలు ఉన్నప్పటకీ పూర్తిస్థాయిలో రుజువు కాలేదు. కేవలం పారితోషకం తీసుకోవడం, ప్రచారం చేసే క్రమంలో టాక్స్ ఎగ్గొట్టడం, మనీలాండరింగ్ కు పాల్పడిన కోణంలోనే విచారణ జరిపి సదరు మొత్తాలను అటాచ్ చేసింది. దీనిపై మరికొన్ని రోజుల్లో కీలక వివరాలు వెలుగుచూసే అవకాశముంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version