GST:జీఎస్టీ సంస్కరణల ఎఫెక్ట్ .. పాలు,పాల ఉత్పత్తుల ధరలు పెరిగాయా? తగ్గాయా?

GST:దేశవ్యాప్తంగా వివిధ వస్తువుల ధరలు తగ్గుతున్న సమయంలో, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద గుడ్‌న్యూస్..

GST

ఏపీ ప్రజలకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ(GST) సంస్కరణల వల్ల.. పాలు, ఇతర పాల ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ వస్తువుల ధరలు తగ్గుతున్న సమయంలో, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది మరో పెద్ద గుడ్‌న్యూస్ అనే చెప్పొచ్చు.

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ(GST)లో కీలక మార్పులు చేసి, జీఎస్టీ శ్లాబులను కేవలం రెండింటికే పరిమితం చేసింది. ఈ మార్పుల వల్ల పాలు, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువులను 5 శాతం జీఎస్టీ (GST)శ్లాబులోకి తీసుకొచ్చారు. దీని ఫలితంగా, సంగం ,విజయ వంటి ప్రముఖ డెయిరీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధరలు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

GST

సంగం డెయిరీ, విజయ డెయిరీ తమ పాలతో పాటు పన్నీరు, నెయ్యి, వెన్న వంటి ఉత్పత్తుల ధరలను కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ధరల తగ్గింపు వివరాలను కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, సంగం డెయిరీ ఎండీ గోపాల్ కృష్ణన్ తెలియజేశారు. విజయ డెయిరీలో లీటరు పాలపై రూ. 5, పన్నీరు, వెన్న, నెయ్యి కిలోలపై రూ. 30 వరకు తగ్గించినట్లు వెల్లడించారు. సంగం డెయిరీలో కూడా యూహెచ్‌టీ పాలు లీటరుపై రూ. 2, పన్నీరు కిలోపై రూ. 15, నెయ్యి, వెన్న కిలోలపై రూ. 30 తగ్గించినట్లు చెప్పారు. అలాగే, మిల్క్ షేక్‌లు, ఇతర బేకరీ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గాయి.

ఈ ధరల తగ్గింపు ప్రజల కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా, ద్రవ్యోల్బణాన్ని కూడా కొంతమేర నియంత్రించడానికి సహాయపడుతుంది. సామాన్య కుటుంబాలకు పాలు , పాల ఉత్పత్తులు అత్యవసరమైనవి. ఈ ధరల తగ్గింపుతో వారి నెలవారీ బడ్జెట్‌పై భారం తగ్గుతుంది. జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక సానుకూల మార్పును తీసుకువస్తున్నాయని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

PTSD :గతం వెంటాడుతున్నట్లు అనిపిస్తుందా? ఇది PTSD కావచ్చు, జాగ్రత్త

Exit mobile version