Mumbai: జలవిలయంలో ముంబై

Mumbai: రోడ్లపై నదులు పారుతున్నాయా అన్నంతగా వరద నీరు నిలిచిపోవడంతో ముంబై నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

Mumbai

ముంబై నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగర జీవితాన్ని పూర్తిగా స్థంభింపజేశాయి. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి. గత 24 గంటల్లోనే దాదాపు 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవ్వడంతో, నగరం మొత్తం జలమయమై ప్రజల కష్టాలు రెట్టింపు అయ్యాయి. రోడ్లపై నదులు పారుతున్నాయా అన్నంతగా వరద నీరు నిలిచిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

ఈ వర్షాల ప్రభావం నగరంలోని రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది. నగరానికి ప్రాణనాడి అయిన లోకల్ రైళ్లు నిలిచిపోయాయి, పలు రైల్వే ట్రాక్ లు నీటిలో మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం(flights cancelled) కలిగింది. దీంతో వేలాదిమంది ప్రయాణీకులు గంటల తరబడి రైల్వే స్టేషన్లలోనే నిలిచిపోయారు. అంతేకాదు, విమాన ప్రయాణాలపైనా ప్రభావం పడింది. భారీ వర్షాల కారణంగా ముంబై విమానాశ్రయం నుంచి 304 విమానాలు ఆలస్యంగా బయలుదేరగా, 10 విమానాలను పూర్తిగా రద్దు చేశారు.

Mumbai

వాతావరణ శాఖ ఇప్పటికే ముంబై(Mumbai)తో పాటు థానే, రాయ్ గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ వంటి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ పరిస్థితిపై స్పందిస్తూ, రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని, సైన్యం సహా అన్ని అత్యవసర సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ముంబైలో ప్రమాదకర స్థాయికి చేరిన మిథి నది నీటి మట్టం కారణంగా లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.

ఈ భారీ వర్షాలు ముంబై(Mumbai)లోనే కాకుండా ఇతర ప్రాంతాలపైనా తమ ప్రభావాన్ని చూపాయి. నాందేడ్ జిల్లాలో రెండు రోజుల్లోనే ఎనిమిది మంది మృతి చెందగా, రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 14కు పెరిగింది. మరోవైపు, ఈ విపత్తు రైతుల జీవితాలపై కూడా పెను ప్రభావం చూపింది. సుమారు 12 నుంచి 14 లక్షల ఎకరాల్లో పంటలు నాశనం అయ్యాయని, దీనివల్ల రైతులు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడ్డారని సీఎం తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాతావరణ అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో కూడా ముంబైలో వర్షాలు కొనసాగనున్నాయి. ముంబై (Mumbai)ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అధికార యంత్రాంగంతో సహకరించి ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించాలని అధికారులు కోరారు. ఒకవైపు నగరం నిలిచిపోయినా, మరోవైపు ప్రజల సహకారం, ప్రభుత్వ చర్యలు ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సహాయపడుతున్నాయి.

 

Exit mobile version