Modi’s biopic: ప్రధాని మోదీ బయోపిక్.. ‘మా వందే’గా పాన్ ఇండియా సినిమా!
Modi's biopic: ప్రధాని మోదీ జీవితం ఆధారంగా “మా వందే” అనే పేరుతో పాన్ ఇండియా బయోపిక్‌ను ప్రకటించారు.

Modi’s biopic
దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం(Modi’s biopic) ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆయన జీవితం ఆధారంగా “మా వందే” అనే పేరుతో పాన్ ఇండియా బయోపిక్‌ను ప్రకటించారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రధాని మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించడం విశేషం. దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సమాజం కోసం ఎన్నో ఆకాంక్షలు గల ఒక సామాన్య బాలుడి నుంచి దేశానికి ప్రధానిగా మోదీ ఎదిగిన అద్భుత ప్రయాణాన్ని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
చిత్ర నిర్మాత వీర్ రెడ్డి.ఎం. మాట్లాడుతూ, ఈ సినిమా మోదీగారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ఎన్నో ముఖ్యమైన సంఘటనలు, విశేషాలను సహజంగా, యదార్థంగా చిత్రీకరించబోతున్నట్లు తెలిపారు. ప్రపంచ నాయకుడిగా ఆయన ఎదగడం వెనుక ఉన్న కష్టం, పట్టుదల, మరియు ముఖ్యంగా ఆయన మాతృమూర్తి హీరాబెన్ ఇచ్చిన స్ఫూర్తిని ఈ కథలో ప్రధానంగా చూపించనున్నారు.
View this post on Instagram
ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పది అనే సందేశం ఈ కథలో కీలకాంశంగా ఉండబోతోంది. తల్లితో మోదీకి ఉన్న అనుబంధం ప్రేక్షకులకు భావోద్వేగాలను పంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాను కేవలం భారతదేశ భాషల్లోనే కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయనున్నామని, అత్యున్నత సాంకేతిక విలువలు , వీఎఫ్‌ఎక్స్ తో ఈ చిత్రం రూపొందుతుందని ఆయన తెలిపారు.
మచ్చలేని నాయకుడిగా దేశ సేవకే జీవితాన్ని అంకితం చేసిన మోదీ జీవిత విశేషాల(Modi’s biopic)ను “మా వందే” సినిమాటిక్ యూనివర్స్ లో అందరికీ నచ్చేలా ఆవిష్కరించబోతున్నట్లు మూవీ యూనిట్ పేర్కొంది.