Just National

Saina Nehwal:ఏడేళ్ల వివాహ బంధానికి సైనా గుడ్ బై ..ప్రేమ ప్రయాణానికి ఫుల్ స్టాప్

Saina Nehwal:భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్(Saina Nehwal) తన ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పారు. తన భర్త, మాజీ షట్లర్ పారుపల్లి కశ్యప్‌తో తాను విడిపోవాలని నిర్ణయించుకున్నానంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు.

Saina Nehwal:భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్(Saina Nehwal) తన ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పారు. తన భర్త, మాజీ షట్లర్ పారుపల్లి కశ్యప్‌తో తాను (Parupalli Kashyap)విడిపోవాలని నిర్ణయించుకున్నానంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఏడేళ్ల వివాహ బంధానికి తెరదించుతూ, సైనా ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. “జీవితం ఎన్నో మలుపులు తిప్పుతుందని, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు” ఆమె తెలిపారు.

బ్యాడ్మింటన్ కోర్టులో మొదలైన ప్రేమకథ..

బ్యాడ్మింటన్ (Badminton)కోర్టులో మొదలైన సైనా, కశ్యప్ ప్రేమ ప్రయాణం, చివరకు 2018లో వివాహ బంధంతో ఒక్కటైంది. వీరిద్దరూ హైదరాబాద్‌లోని ప్రఖ్యాత పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలిసి శిక్షణ పొందుతూ, క్రీడా రంగంలోనే కాదు, జీవితంలోనూ భాగస్వాములయ్యారు.

సైనా నెహ్వాల్ ఒలింపిక్ కాంస్య పతకంతో మెరిసి, ప్రపంచ నంబర్ వన్‌గా వెలుగొంది, గ్లోబల్ ఐకాన్‌గా మారారు. మరోవైపు, పారుపల్లి కశ్యప్ ప్రపంచ టాప్ 10లోకి దూసుకెళ్లి, 2014 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. అలాంటి అద్భుతమైన జంట విడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సైనా: దేశం గర్వించదగిన బ్యాడ్మింటన్ ఐకాన్
హర్యానాకు చెందిన సైనా నెహ్వాల్, 2008లో BWF ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి, అద్భుతాలు సృష్టించారు. అదే సంవత్సరం ఒలింపిక్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా చరిత్ర లిఖించారు. ఆ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి, దేశానికి పతకం అందించిన తొలి భారతీయ షట్లర్‌గా రికార్డు సృష్టించారు.

ఆమె అలుపెరగని కృషికి గుర్తింపుగా 2009లో అర్జున అవార్డు, 2010లో అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను అందుకున్నారు. ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్‌ను సాధించిన ఏకైక భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనా, దేశంలో ఎంతో మంది అథ్లెట్లకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు.

32 ఏళ్ల తర్వాత స్వర్ణం తెచ్చిన కశ్యప్:  
పారుపల్లి కశ్యప్, 2014 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించారు. 32 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. ప్రకాష్ పదుకొనే, పుల్లెల గోపీచంద్ వంటి దిగ్గజాల వద్ద శిక్షణ పొందిన కశ్యప్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ పురుష బ్యాడ్మింటన్ ఆటగాడిగా నిలిచారు.

2013లో ప్రపంచ ర్యాంకింగ్‌లో ఆరవ స్థానానికి చేరుకుని తన కెరీర్‌లో అత్యుత్తమ స్థాయిని అందుకున్నారు. అయితే, నిరంతర గాయాలు ఆయన కెరీర్‌కు అడ్డంకులుగా మారాయి, వాటిని అధిగమించడానికి ఆయన చాలా శ్రమించారు.అయితే ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ షట్లర్ల విడిపోవడం, వారి అభిమానులతో పాటు క్రీడా లోకాన్ని కూడా  షాక్‌కు గురిచేసింది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button