Just NationalLatest News

Vaibhav Suryavanshi:వైభవ్ సూర్యవంశీ ఈ T20 వరల్డ్ మ్యాచ్‌కు దూరంగా ఉండాల్సిందేనా?

Vaibhav Suryavanshi:అద్భుతమైన, సంచలనాత్మక ప్రదర్శన చేసినప్పటికీ, వైభవ్ సూర్యవంశీకి ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కడం కష్టమే అంటున్నారు.

Vaibhav Suryavanshi:క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒకే పేరు మారుమోగుతోంది – వైభవ్ సూర్యవంశీ. ఇటీవల ఇంగ్లాండ్ అండర్-19)(England U19తో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో ఈ కుర్రాడు సృష్టించిన సునామీ మామూలుగా లేకపోవడంతో.. చిన్న పిల్లాడి నుంచి పెద్ద వాళ్ల వరకు, క్రికెట్ అభిమానులందరూ వైభవ్‌ను చూసి ఔరా అంటున్నారు. 14 ఏళ్ల వయసులోనే ‘శభాష్’ అనిపించుకుంటున్న ఈ యంగ్ గన్.. మూడు వన్డేల్లో ఏకంగా 355 పరుగులు చేసి భారత్ తరపున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఒక రకంగా చెప్పాలంటే, అతను ఇప్పుడు యువతకు రోల్ మోడల్, క్రికెట్ కెరీర్‌లో సక్సెస్ ఐకాన్‌గా నిలిచిపోయాడు.

Vaibhav Suryavanshi:

ఇంగ్లాండ్‌పై విధ్వంసం: లిటిల్ మాస్టర్ వన్ సైడ్ షో
ఆతిథ్య ఇంగ్లాండ్ అండర్-19తో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ ఝుళిపించిన తీరు చూసి అంతా షాక్ అయ్యారు. మొత్తం 5 మ్యాచ్‌ల్లో 355 పరుగులు సాధించాడంటే అతని దూకుడు అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 29 సిక్సర్లు, 30 ఫోర్లు వీర బాదుడు బాదాడంటే.. ఇది మామూలు బ్యాటింగ్ కాదు. ఇది అసలు సిసలు విధ్వంసం అని సీనియర్ క్రికెటర్స్ ఓపెన్‌గా కామెంట్లు పెట్టారంటేనే వైభవ్ విశ్వరూపం అర్ధం చేసుకోవచ్చు.

టీమిండియా ఎంట్రీకి ఎందుకు బ్రేక్? ఐసీసీ రూల్ ఏంటి?
ఇంతటి అద్భుతమైన, సంచలనాత్మక ప్రదర్శన చేసినప్పటికీ, వైభవ్ సూర్యవంశీకి ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కడం కష్టమే అంటున్నారు. దానికి ప్రధాన కారణం ఐసీసీ (ICC) కొత్త నియమం. వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు 14 సంవత్సరాలు. ఐసీసీ నిబంధనల ప్రకారం( ICC age rule), ఏ ఆటగాడైనా జాతీయ జట్టుకు ఆడాలంటే కనీసం 15 సంవత్సరాలు నిండి ఉండాలి.

వైభవ్ సూర్యవంశీ ఎందుకు వేచి ఉండాల్సి వస్తోంది?

2020లో, ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ కోసం ఈ కనీస వయస్సు నియమాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం మాత్రమే జాతీయ ఆటగాళ్ళను ఎంపిక చేస్తారు. వైభవ్ సూర్యవంశీకి వచ్చే ఏడాది మార్చి 27న 15 సంవత్సరాలు నిండుతాయి. అప్పటి వరకు అతను జాతీయ జట్టుకు అర్హత సాధించలేడు.

గతంలో, అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి కనీస వయోపరిమితి ఉండకపోవడంతో.. పాకిస్తాన్‌కు చెందిన హసన్ రాజా కేవలం 14 సంవత్సరాల 227 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ప్రస్తుత ఐసీసీ నిబంధనల వల్ల, వైభవ్ సూర్యవంశీ ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం కష్టం.

భవిష్యత్ ప్రణాళికలు: టీ20 ప్రపంచకప్‌కు నో ఛాన్స్?
ఈ ఏజ్ లిమిట్ వల్ల వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేడు. అయితే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు ఒక ప్రత్యేక అభ్యర్థన చేస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది. అలా చేస్తే, ఐసీసీ ఆ యువ ఆటగాడికి ఒక పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతేనే, ఐసీసీ అతనికి అనుమతి ఇస్తుంది.

కానీ ప్రస్తుతం భారత టీ20 జట్టులో చోటు కోసం భారీ సంఖ్యలో  ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. అందువల్ల, బీసీసీఐ అలాంటి స్పెషల్ రిక్వెస్ట్ చేసే అవకాశం చాలా తక్కువ కాబట్టి.. వైభవ్ సూర్యవంశీ భారతదేశం తరపున అంతర్జాతీయంగా అరంగేట్రం చేయడానికి కనీసం ఒక సంవత్సరం పాటు వేచి ఉండాల్సి వస్తుంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button