Just NationalLatest News

MLA’s son: సీఎం కుమారుడిది సింపుల్ పెళ్లి.. ఎమ్మెల్యే కుమారుడిది రాయల్ రిసెప్షన్

MLA's son: భోపాల్‌లో వివాహం చాలా సింపుల్‌గా జరిగినా, రాయ్‌సేన్‌లోని ప్రభుత్వ మైదానంలో నిర్వహించిన రిసెప్షన్ మాత్రం ఒక ఉత్సవంలా సాగింది.

MLA’s son

మధ్యప్రదేశ్‌లోని సాంచీ ఎమ్మెల్యే ప్రభురామ్ చౌదరి తన కుమారుడు(MLA’s son) పర్వ్ చౌదరి వివాహ రిసెప్షన్‌ను అత్యంత విలాసవంతంగా నిర్వహించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భోపాల్‌లో వివాహం చాలా సింపుల్‌గా జరిగినా, రాయ్‌సేన్‌లోని ప్రభుత్వ మైదానంలో నిర్వహించిన రిసెప్షన్ మాత్రం ఒక ఉత్సవంలా సాగింది.

సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ వేడుక కోసం వినియోగించి, 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ టెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు 30 వేల మందికి పైగా అతిథులు హాజరయ్యారు. వారి కోసం 1000 మంది వంటవాళ్లతో దాదాపు 25 రకాల దేశ, విదేశీ వంటకాలను సిద్ధం చేయించారు.

అతిథుల సంఖ్య భారీగా ఉండటంతో మైదానం చుట్టూ పటిష్టమైన బారికేడ్లు, వీఐపీల కోసం ఎర్ర తివాచీలు వేసి విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా వంటి దిగ్గజాలు హాజరుకావడంతో రాయ్‌సేన్ పట్టణం అంతా వీఐపీలతో నిండిపోయింది. వీరి రాక కోసం ట్రాఫిక్ మళ్లించడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

MLA's son
MLA’s son

ఈ (MLA’s son)వేడుకలో విందు మాత్రమే కాదు, వినోదం కూడా అదే స్థాయిలో ఉంది. రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన జానపద కళాకారులు తమ ఆటపాటలతో అతిథులను అలరించారు. అయితే అదే సమయంలో ఇండోర్‌కు చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే గోలు శుక్లా కుమారుడి పెళ్లిలో జరిగిన భారీ ఖర్చు కూడా ఇప్పుడు చర్చల్లోకి వస్తోంది.

ఆ పెళ్లిలో కేవలం 10 నిమిషాల బాణసంచా ప్రదర్శన కోసమే దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దేవాలయాల గర్భగుడిలోకి సామాన్యులకు అనుమతి లేకపోయినా, ఈ వీఐపీ జంటలకు ప్రత్యేక ప్రవేశం కల్పించడంపై కూడా ప్రజలు మండిపడుతున్నారు.

ఒకవైపు అదే రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కుమారుడి వివాహాన్ని సామూహిక వివాహ వేడుకలో అత్యంత సాదాసీదాగా జరిపించి ఆదర్శంగా నిలిస్తే, ఆయన పార్టీకే చెందిన ఎమ్మెల్యే మాత్రం తన కొడుకు(MLA’s son) రిసెప్షన్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇలా ఆర్భాటం చేయడం విమర్శలకు దారితీస్తోంది. స్థానికులు అయితే ఈ పెళ్లికి పెట్టిన ఖర్చుతో ఒక చిన్నపాటి ప్రాజెక్టు నిర్మించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి భారీ ఖర్చుల మధ్య కూడా కొందరు ప్రముఖులు చాలా సింపుల్‌గా పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచిన వారిని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు . ఉదాహరణకు, గతంలో ఐఏఎస్ అధికారి పరమ్ వీర్ సింగ్ తన కుమారుడి వివాహాన్ని కేవలం 500 రూపాయల ఖర్చుతో జరిపించి సంచలనం సృష్టించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తన కుమార్తె వివాహాన్ని సామూహిక వివాహ వేడుకలో వందలాది పేద జంటలతో కలిపి జరిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

MLA's son
MLA’s son

తెలంగాణలో సిరిసిల్ల కలెక్టర్‌గా పనిచేసిన కృష్ణ భాస్కర్ తన వివాహాన్ని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా రిజిస్టర్ ఆఫీస్‌లో చేసుకుని ఆదర్శంగా నిలిచారు. మరో ఐఏఎస్ అధికారి జగదీష్ తన పెళ్లికి కేవలం 16 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి, మిగిలిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. తమిళనాడులో కూడా ఒక ఎమ్మెల్యే తన కుమార్తె వివాహాన్ని ఎటువంటి హంగులు లేకుండా ఒక గుడిలో చాలా నిరాడంబరంగా జరిపించిన సందర్భాలు ఉన్నాయి.

రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఒకవైపు విలాసవంతమైన వివాహాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే, మరోవైపు ఇలాంటి వారు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు అప్పులు చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్న ఈ రోజుల్లో, అధికారం, హోదా ఉన్నవారు నిరాడంబరంగా వివాహాలు చేసుకోవడం అనేది గొప్ప విషయమే.

సాంచీ ఎమ్మెల్యే చేసిన విలాసవంతమైన ఏర్పాట్లు ఒకవైపు అట్టహాసంగా అనిపించినా, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాటించిన నిరాడంబరతతో పోల్చి చూసినప్పుడు రాజకీయాల్లో ఉండే విభిన్న ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button