Tourist places : ఈ టూరిస్ట్ ప్లేసులు త్వరలో కనుమరుగవుతాయట ..

Tourist places : కాలం గడిచే కొద్దీ పట్టణీకరణ, పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి కారణాల వల్ల కొన్ని అరుదైన ప్రదేశాలు మెల్లగా కనుమరుగయ్యే చివరి దశలో ఉన్నాయి.

Tourist places

ప్రపంచంలో కొన్ని అందమైన ప్రదేశాలు ఎప్పటికీ అలాగే ఉంటాయని చెప్పలేం. కాలం గడిచే కొద్దీ పట్టణీకరణ, పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి కారణాల వల్ల కొన్ని అరుదైన ప్రదేశాలు మెల్లగా కనుమరుగయ్యే చివరి దశలో ఉన్నాయి. అందుకే అరుదైన ఈ ప్రాంతాలను వీలైనంత త్వరగా సందర్శించాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

భారతదేశంలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న కొన్ని అరుదైన ప్రాంతాలు:

Tourist places

మజులీ రివర్ ఐల్యాండ్ (Majuli River Island-Tourist places ) – అస్సాం.. మజులీ అనేది ఒక అద్భుతమైన రివర్ ఐల్యాండ్ (నది మధ్యలో ఏర్పడిన ద్వీపం). అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఏర్పడిన ఈ మజులీ ఐల్యాండ్, ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐల్యాండ్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ ద్వీపం అంతా స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా ఉండి, ఏ సీజన్‌లో చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. అయితే, డీఫారెస్టేషన్ (అడవుల నరికివేత) మరియు నదీకోత కారణంగా ఈ ఐల్యాండ్ క్రమంగా కుచించుకుపోతుందట. మరో పాతికేళ్లలో ఈ ఐల్యాండ్ వైశాల్యం బాగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

Tourist places

సుందర్బన్ అడవులు (Sundarbans-Tourist places ) – పశ్చిమ బెంగాల్.. సుందర్బన్ అడవులు మనదేశంలోనే అతిపెద్ద మాంగ్రూవ్ (Mangrove) అడవులు. ఈ అడవులు మూడో వంతు భారతదేశంలో (పశ్చిమ బెంగాల్), మిగతాది బంగ్లాదేశ్‌లో విస్తరించి ఉన్నాయి. ఇది యునెస్కో వారసత్వ సంపద (UNESCO World Heritage Site). ఈ అడవుల్లోనే ప్రస్తుతం ప్రపంచంలో అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన బెంగాల్ టైగర్స్ (సుమారు 250 రకాలు) నివసిస్తాయి. సుందర్బన్స్ చేతల్ జింక, కింగ్ కోబ్రా, రేసస్ కోతులను కూడా ఇక్కడ చూడొచ్చు. అయితే, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టం పెరిగి, ఫ్యూచర్‌లో ఈ అడవులు మునిగిపోయే ప్రమాదముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Tourist places

ఉలార్ లేక్ (Wular Lake-Tourist places ) – జమ్మూ కాశ్మీర్.. జమ్మూకాశ్మీర్‌లోని బందిపురా జిల్లాలో ఉన్న ఉలార్ సరస్సు ఆసియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి. ఈ సరస్సు పరిసరాల్లో ఉండే విల్లో చెట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాదు, ఈ సరస్సు పక్షులకు స్వర్గధామం. బాతులు, యురేసియన్ పిచ్చుకలు, పొట్టికాళ్ళ గద్దల నుంచి హిమాలయన్ మోనాల్, గోల్డెన్ ఓరిలో వంటి వేల రకాల పక్షులు ఇక్కడికి వచ్చి చేరుతుంటాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఇక్కడ చెట్ల సంఖ్య రోజురోజుకీ తగ్గుతూ వస్తుంది. చెట్లు లేకపోతే సరస్సు ఎంతో కాలం పచ్చగా ఉండలేదు. అందుకే ఈ సరస్సు త్వరలో అంతరించొచ్చని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Tourist places

కోరల్ రీఫ్ (Coral Reef) – లక్షద్వీప్.. లక్షద్వీప్‌లో సముద్రం అడుగున ఉండే కోరల్ రీఫ్ అంటే పగడపు దీవుల సముదాయం. ఇవి వలయాకారంలో ఉండి ఎంతో అందంగా కనిపిస్తాయి. నీలం రంగులో ఉండే సముద్రం, తెల్లగా మెరిసే ఇసుక తిన్నెలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. అయితే, ఇక్కడ జరుగుతున్న బ్లాస్ట్ ఫిషింగ్, కోరల్ మైనింగ్ కారణంగా ఈ ప్రాంతం డేంజర్ జోన్‌లో ఉంది. అలాగే, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల రాను రాను సముద్ర మట్టం పెరిగితే ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version