Diya : దీపం వెలిగించే నూనెలో ఈ ఒక్క వస్తువు వేయండి..మీ ఇంటికి ధనలక్ష్మి నడుచుకుంటూ వస్తుంది..
Diya: దీపం వెలిగించేటప్పుడు వాడే నూనెలో కొన్ని చిన్న వస్తువులను చేర్చడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
Diya
దీపం (Diya)వెలిగించడం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు, అది మన ఇంట్లోని అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే ప్రక్రియ. అయితే దీపం వెలిగించేటప్పుడు వాడే నూనెలో కొన్ని చిన్న వస్తువులను చేర్చడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఈ చిన్న చిట్కాలను పాటించి చూడండి.
మీరు ప్రతిరోజూ దీపం(Diya) వెలిగించే నూనెలో (నువ్వుల నూనె లేదా నెయ్యి) ఒక చిన్న పచ్చ కర్పూరం ముక్క లేదా ఒక లవంగం వేయండి.
పచ్చ కర్పూరం.. పచ్చ కర్పూరం విష్ణుమూర్తికి , లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. దీపం వెలుగుతున్నప్పుడు ఈ కర్పూరం కరిగి దాని నుంచి వచ్చే సువాసన ఇంట్లోని నెగెటివ్ వైబ్స్‌ను పారద్రోలి, ధన ఆకర్షణను పెంచుతుంది. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచి, ఇంట్లో గొడవలు లేకుండా చేస్తుంది.
లవంగం.. దీపం నూనెలో ఒక లవంగం వేయడం వల్ల గ్రహ దోషాలు తగ్గుతాయని, ముఖ్యంగా రాహు-కేతు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

సాధారణంగా నువ్వుల నూనెతో దీపం(Diya) వెలిగించడం శ్రేయస్కరం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ఉత్తమం. ఒకవేళ మీరు ఆవ నూనె వాడుతున్నట్లయితే, అందులో ఒక చిన్న ముక్క ఎండు ద్రాక్ష వేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.
దీపంలో వాడే వత్తులు కూడా సంపదను ప్రభావితం చేస్తాయి. తామర నారతో చేసిన వత్తులను వాడితే పూర్వ జన్మ పాపాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. ఎరుపు రంగు వత్తులు సంతాన ప్రాప్తిని, పసుపు రంగు వత్తులు వివాహ సంబంధ సమస్యలను తొలగిస్తాయి.
ఫలితం ఎప్పుడు కనిపిస్తుంది?..ఈ చిన్న మార్పును వరుసగా 41 రోజుల పాటు చేసి చూడండి. మీ ఇంట్లో సానుకూల మార్పులు మొదలవుతాయి. అనవసర ఖర్చులు తగ్గి, ఆదాయ మార్గాలు మెరుగుపడటాన్ని మీరు గమనిస్తారు.



