Trisha:సినిమాలకు త్రిష గుడ్ బై చెప్పేస్తారా? విజయ్ బాటలోనే సౌత్ క్వీన్?
Trisha: తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభరలోనూ, తమిళంలో సూర్య సరసన కరుప్పు అనే సినిమాలో కూడా త్రిషనే నటిస్తున్నారు.
Trisha
దక్షిణాది చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లుగా తన అందం, నటనతో కోట్లాది మంది అభిమానుల మనసును గెలుచుకున్న త్రిష(Trisha) కృష్ణన్ ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా త్రిష పేరు ఏదొక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
మెయిన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో త్రిషకు ఉన్న రిలేషన్ గురించి గట్టిగానే గాసిప్స్ వస్తున్నాయి. అయితే ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరు కావడంతో ఆ ప్రచారానికి మరింత మసాలా యాడ్ చేసినట్లు అయింది. దీనిపై ఆమె ఎప్పుడూ రియాక్టవలేదు. అయితే ఇప్పుడు ఏకంగా త్రిష సినిమాలకే స్వస్తి చెప్పబోతున్నారనే వార్త వినిపించడంతో ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది.
ప్రస్తుతం త్రిష(Trisha) చేతిలో రెండు భారీ ప్రాజెక్టులున్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’లోనూ, తమిళంలో సూర్య సరసన ‘కరుప్పు’ అనే సినిమాలో కూడా త్రిషనే నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఆమె కొత్తగా ఏ ప్రాజెక్టుకు కూడా సంతకం చేయలేదని తెలుస్తోంది.
విజయ్ ఎలా అయితే తన పార్టీ టీవీకే (TVK) ద్వారా రాజకీయాల్లోకి వచ్చి సినిమాలను వదిలేశారో, త్రిష కూడా అదే రూట్‌లో వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదుయవిజయ్ స్థాపించిన పార్టీలోనే త్రిష కూడా చేరి, వచ్చే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోందని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

ఇక తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన హీరోయిన్ త్రిషను మీడియా ప్రతినిధులు ఈ విషయాల గురించి గుచ్చి గుచ్చి అడిగారు మేడం.. విజయ్‌తో పెళ్లికి వెళ్లారు కదా?, మీరు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించినా త్రిష ఏమాత్రం స్పందించలేదు. కనీసం అటు తిరిగి చూడకుండా, తనను కాదు అన్నట్లుగా త్రిష తన దారిన తాను వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వర్షం సినిమాతో తెలుగులో జిగేల్ మనిపించే పాత్రతో కొద్దికాలంలోనే స్టార్‌గా ఎదిగి, 20 ఏళ్లుగా నెంబర్ వన్ రేసులో ఉన్న త్రిష.. సెకండ్ ఇన్నింగ్స్‌లో పొన్నియన్ సెల్వన్‌తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. 42 ఏళ్ల వయసులోనై తన క్రేజ్ ఏమాత్రం తగ్గని ఈ సమయంలో త్రిష.. నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి.





