TTD tickets:టీటీడీ టికెట్లు వాట్సాప్ ద్వారా చిటికెలో ఇలా బుక్ చేసుకోండి..
TTD tickets: తాజాగా, టీటీడీకి సంబంధించిన నాలుగు రకాల ముఖ్య సేవలను కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులోకి తెచ్చింది.

TTD tickets
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్‌లో క్రమంగా మరిన్ని సేవలను జోడిస్తోంది. తాజాగా, టీటీడీకి సంబంధించిన నాలుగు రకాల ముఖ్య సేవలను కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. భక్తులు ఇకపై దర్శనం, వసతి, ఇతర కీలక సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా టీటీడీ సేవలు అందుబాటులోకి రావడంతో.. ఈ కొత్త సదుపాయం ద్వారా భక్తులు ప్రధానంగా ఈ కింది వివరాలను తెలుసుకోవచ్చు.
దర్శనం స్థితి… స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ సెంటర్‌ల సమాచారం, ప్రస్తుతం ఎన్ని టికెట్లు (TTD tickets)అందుబాటులో ఉన్నాయి, సర్వ దర్శనం క్యూలైన్ ఏ మేరకు ఉంది, శ్రీవారి దర్శనానికి సుమారు ఎన్ని గంటలు పడుతోంది అనే సమాచారం తెలుసుకోవచ్చు.

- శ్రీవాణి టికెట్లు.. శ్రీవాణి టికెట్లకు సంబంధించిన కౌంటర్ స్టేటస్ వంటి వివరాలు చూడొచ్చు.
- వసతి (రూమ్స్).. రూమ్స్ కోసం చెల్లించిన డిపాజిట్ రీఫండ్ వివరాల వంటి సమాచారం కూడా ఉంటుంది.
- వాట్సాప్‌లో టికెట్లు బుక్ చేసుకునే విధానం (స్టెప్ బై స్టెప్) ఎలా అంటే..
టీటీడీ సేవలను లేదా టికెట్ల(TTD tickets)ను వాట్సాప్‌లో బుక్ చేసుకోవడానికి లేదా వివరాలు తెలుసుకోవడానికి మొదటగా, 9552300009 అనే వాట్సాప్ నంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. మీ వాట్సాప్ అప్లికేషన్‌ను తెరిచి, ఈ నంబర్‌కు కేవలం “హాయ్” (Hi) అని మెసేజ్ పంపాలి. చాట్‌బాట్ నుంచి మీకు వివిధ ఆప్షన్లు కనిపిస్తాయి. అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుంచి “ఆలయ బుకింగ్ సేవలు” అనే విభాగాన్ని ఎంచుకోవాలి.
దర్శన టిక్కెట్లు(TTD tickets), సేవా రిజర్వేషన్లు, వసతి (Accommodation), లేదా ఇతర సేవలను బుక్ చేసుకోవడానికి చాట్‌బాట్ మీకు తదుపరి సూచనలు ఇస్తుంది.ఇక్కడ స్లాటెడ్ సర్వదర్శనం, సర్వ దర్శనం క్యూలైన్ స్థితి, శ్రీవాణి కౌంటర్ స్టేటస్,డిపాజిట్ రీఫండ్ లైవ్ స్టేటస్ వంటి ఆప్షన్లను ఎంచుకుని సమాచారాన్ని పొందొచ్చు.
బుకింగ్ పూర్తయిన తర్వాత, టికెట్‌కు సంబంధించిన వివరాలు మీకు వాట్సాప్‌లోనే అందుతాయి. భక్తులు ఆ వివరాలను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.
ఈ సులభమైన పద్ధతి ద్వారా భక్తులు తమ తిరుమల ప్రణాళికను మరింత మెరుగ్గా, తక్కువ సమయంలో పూర్తి చేసుకోవచ్చు.