Just SpiritualLatest News

Karma:కర్మ , పునర్జన్మ నిజంగానే ఉంటాయా? శాస్త్రంలో వీటి గురించి ఏం చెబుతారు?

Karma: కర్మ ఫలం వెంటనే కాక, ప్రస్తుత జీవితంలో లేదా రాబోయే పునర్జన్మలలో అనుభవించబడుతుందని శాస్త్రాలు చెబుతాయి.

Karma

కర్మ (Karma) పునర్జన్మ , సిద్ధాంతాలు హిందూ, బౌద్ధ , జైన ధర్మాల యొక్క మూల స్తంభాలుగా చెబుతారు పండితులు. ఈ రెండు భావనలు మానవ జీవితానికి మ, విశ్వానికి ఒక నైతిక, కారణ-కార్య (Cause-and-Effect) చట్రాన్ని అందిస్తాయి. కర్మ అంటే ‘చర్య’ లేదా ‘పని’. ప్రతి ఆలోచన, మాట ,శారీరక చర్య ఒక శక్తిని (Energy) సృష్టిస్తుందని శాస్త్రాలు వివరిస్తాయి..

ఇది మన భవిష్యత్తుపై ప్రభావం చూపే ఒక ‘కర్మ ఫలాన్ని’ (Consequence) తిరిగి మనకు అందిస్తుంది. ఈ కర్మ ఫలం వెంటనే కాక, ప్రస్తుత జీవితంలో లేదా రాబోయే పునర్జన్మలలో అనుభవించబడుతుందని శాస్త్రాలు చెబుతాయి. ఈ సిద్ధాంతం మనిషికి స్వేచ్ఛా సంకల్పాన్ని (Free Will) ప్రసాదిస్తుంది.

Karma
Karma

మన చర్యలను ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది, కానీ ఆ చర్యల ఫలితాలను అనుభవించాల్సిన బాధ్యత మనదే. కర్మను మూడు ప్రధాన రకాలుగా విభజిస్తారు:
1. సంచిత కర్మ.. పూర్వ జన్మల్లో పేరుకుపోయి, ఇంకా ఫలించని కర్మల మొత్తం నిల్వ.
2. ప్రారబ్ధ కర్మ: సంచిత కర్మ నుంచి ఈ జీవితంలో అనుభవించడానికి ఎంచుకున్న భాగం (మన విధి లేదా డెస్టినీ).
3. క్రియమాణ కర్మ: ప్రస్తుత జీవితంలో మనం నిరంతరం సృష్టిస్తున్న కొత్త కర్మలు, దీని ఫలితం భవిష్యత్తులో ఉంటుంది.
ఈ కర్మల యొక్క ఫలాలను అనుభవించేందుకు, ఆత్మ నిరంతరం జననం, మరణం , పునఃజననం (పునర్జన్మ) అనే సంసార చక్రాన్ని కొనసాగిస్తుంది.
ఈ చక్రం నుంచి విముక్తి పొందడమే మోక్షం (విముక్తి లేదా తుది విలీనం). కర్మ సిద్ధాంతం అనేది జీవితంలో ధర్మం (Righteousness), నిస్వార్థత, కరుణతో కూడిన చర్యలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒక లోతైన నైతిక దర్శనం (Moral Philosophyగా పండితులు భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button