IND vs NZ: ఇండోర్‌లో టీమిండియా ఫ్లాప్ షో..న్యూజిలాండ్ దే వన్డే సిరీస్
IND vs NZ : న్యూజిలాండ్ సిరీస్ విజయంతో 2026 ను ప్రారంభిద్దామనుకున్న టీమిండియాకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది
IND vs NZ
కొత్త ఏడాదిలో సొంతగడ్డపై భారత్ కు పరాభవం ఎదురైంది. సిరీస్ విజయంతో 2026 ను ప్రారంభిద్దామనుకున్న టీమిండియాకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్(IND vs NZ) ను 2-1తో కివీస్ కైవసం చేసుకుంది. బౌలర్ల చెత్త ప్రదర్శన , బ్యాటర్ల ఫ్లాప్ షోతో ఇండోర్ వన్డేలో భారత్ భారీ టార్గెట్ ను ఛేదించలేక చతికిలపడింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే తుది జట్టులో వరుసగా విఫలమవుతున్న ప్రసిద్ధ కృష్ణ స్థానంలో అర్షదీప్ వచ్చాడు.
న్యూజిలాండ్ కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ నికోల్స్ ను అర్షదీవ్ తొలి ఓవర్లోనే ఔట్ చేయగా..కాన్వేను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. కాసేపు విల్ యంగ్, డారిల్ మిచెల్ కివీస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. విల్ యంగ్ ఔట్ అయ్యాక డారిల్ మిఛెల్ కు గ్లెన్ ఫిలిప్స్ జత కలిసాడు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఆధివత్యం కనబరిచారు.
ఎప్పటిలానే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు చేతులెత్తేశారు. ఆరంభంలో వికెట్లు తీసిన హర్షిత్ రాణా తర్వాత భారీగా వరుగులు ఇచ్చేసాడు.సిరాజ్ పొదువుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేకపోయాడు. ఇక నితీశ్ కుమార్ రెడ్డి కూడా వూర్తిగా నిరాశపరిచాడు. స్పిన్నర్లు కూడా ప్రభావం చూపలేకపోవడంతో మిచెల్, ఫిలిప్స్ జోడీ నాలుగో వికెట్ కు 219 వరుగులు జోడించింది. ఈ క్రమంలో మిఛెల్ 106 బంతుల్లో మరో శతకం చేయగా.. అటు ఫిలిప్స్ కూడా సెంచరీతో అదరగొట్టాడు.

దూకుడుగా ఆడిన గ్లెన్ ఫిలిప్స్ కేవలం 83 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరి జోడీ పూర్తిగా డామినేట్ చేసిందనే చెప్పాలి. చివరికి న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 337 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్ తప్పిస్తే మిగిలిన వారంతా భారీగా వరుగులు సమర్పించుకున్నారు.
భారీ లక్ష్యఛేదనలో భారత్ కు ఆరంభం లోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ రోహిత్ శర్మ మూడో వన్డేలోనూ నిరాశపరిచాడు. గిల్ , శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా ఔటవడంతో భారత్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విరాట్ కోహ్లి, నితీశ్ కుమార్ రెడ్డి జట్టును ఆడుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు వూర్తి చేసుకున్నారు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత నితీశ్ వెనుదిరగడంతో 88 వరుగుల పార్టనర్ షిప్ కు తెరవడింది. తర్వాత జడేజా కూడా వెనుదిరగడంతో భారత్ 200 అయినా చేస్తుందా అనుకున్నారు.
ఈ పరిస్థితుల్లో హర్షిత్ రాణా కోహ్లీకి జత కలిసాడు. మెరుపు హాఫ్ సెంచరీతో హర్షిత్ రాణా చెలరేగాడు. అటు కోహ్లీ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ కు ఇది వన్డేల్లో 54వ శతకం. అంతర్జాతీయ కెరీర్లో 85 సెంచరీ, అయితే దూకుడుగా ఆడే క్రమంలో రాణా ఔటవడం, మరుసటి బంతికే సిరాజ్ ఔటవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. కోహ్లి 124 పరుగులకు వెనుదిరగ్గా భారత్ ఇన్నింగ్స్ కు 296 రన్స్ దగ్గర తెరపడింది. ఈ విజయంతో న్యూజిలాండ్ భారత్ లో తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్(IND vs NZ) ను సొంతం చేసుకుంది.



