Saturday: శనివారం రోజు ఈ పనులు చేయండి.. కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం సొంతమవుతుంది..

Saturday: శని తీవ్రతను తగ్గించుకోవడానికి శనివారం రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కర్మ శాస్త్రం చెబుతోంది.

Saturday

చాలామందికి తమ జాతకంలో శని ప్రభావం ఉండటం వల్ల పనులు ఆగిపోవడం, అనారోగ్యం, ఆర్థిక కష్టాలు, అవాంతరాలు ఎదురవుతుంటాయి. అయితే శని దేవుడు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కర్మ ఫల ప్రదాత.మనం చేసే మంచి పనులను బట్టి ఆయన ఫలితాలను ఇస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అయితే, శని దోషం ఉన్నవారు అలాగే తమ జీవితాంతం బాధపడనక్కరలేదు. తీవ్రతను తగ్గించుకోవడానికి శనివారం రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కర్మ శాస్త్రం చెబుతోంది.

శనివారం(Saturday) రోజు ఉదయాన్నేలేచి తలస్నానం చేసి..మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో శని దేవునిని సందర్శించాలి. అక్కడ నల్ల నువ్వులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శని దేవుడు ప్రసన్నుడవుతాడు. ముఖ్యంగా శనివారం రోజు నలుపు రంగు వస్తువులను, వస్త్రాలను, చెప్పులను పేదవారికి దానం చేయడం వల్ల మీ దోష నివారణ జరుగుతుంది. అలాగే శని దేవునికి హనుమంతుడు అంటే చాలా ఇష్టం, అందుకే శనివారం హనుమాన్ చాలీసా పఠించే వారిని కూడా శని బాధించడు.

Saturday

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, శనివారం(Saturday) రోజు ఎవరినీ నొప్పించకూడదు, ముఖ్యంగా శారీరక శ్రమ చేసే కూలీలను, వృద్ధులను గౌరవించాలి. వీలయితే వారికి తోచినంత సాయం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే శనివారం రోజు ఇనుము వస్తువులు, నూనెను ఇంటికి కొనడం మంచిది కాదని అంటారు. ఈ నియమాలను పాటిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే శని దేవుడు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని పెద్దలు చెబుతారు.

Mana Shankar Varaprasad Garu:మన శంకర్ వరప్రసాద్ గారు.. ప్రీమియర్ షోల టైమింగ్స్, టికెక్ ధరల డిటైల్స్

Exit mobile version