House Entrance: గుమ్మం వద్ద ఈ 3 పనులు చేస్తే మీ ఇంట్లో ధనవర్షం గ్యారంటీ

House Entrance: లక్ష్మీ దేవిని శాశ్వతంగా మీ ఇంట్లో కొలువై ఉండేలా చేయాలంటే, సింహద్వారం వద్ద మూడు ప్రత్యేకమైన వస్తువులు ఉండటం తప్పనిసరి.

House Entrance

ఏ ఇంటికి అయినా ప్రాణం ఆ ఇంటి సింహద్వారమే. వాస్తు శాస్త్రం ప్రకారం, విశ్వంలోని సకల శక్తి ప్రవాహాలు ప్రధాన ద్వారం నుంచే ఇంటి లోపలికి ప్రవేశిస్తాయి. చాలా మంది ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది అని బాధపడుతుంటారు. దీనికి కారణం ఇంటి గుమ్మం వద్ద ఉండే వాస్తు దోషాలేనని పండితులు చెబుతుంటారు. లక్ష్మీ దేవిని శాశ్వతంగా మీ ఇంట్లో కొలువై ఉండేలా చేయాలంటే, సింహద్వారం (House Entrance)వద్ద మూడు ప్రత్యేకమైన వస్తువులు ఉండటం తప్పనిసరి. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు, మన ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చే అద్భుతమైన మార్గాలు.

నీటి పాత్ర, తులసి దళాలు (జల శక్తి).. సింహద్వారం బయట చిన్నపాటి నీటి పాత్రను ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రాచీన కాలంలో ప్రతి ఇంటి ముందు నీటి కుండ ఉండేది. దీనికి కారణం నీరు శాంతికి సంకేతం. అందుకే ఇప్పుడు చిన్న ఇత్తడి, రాగి,లేదా మట్టి పాత్రలో నీటిని నింపి, అందులో ఐదు తులసి దళాలను వేసి సింహద్వారం(House Entrance) వద్ద ఉంచాలని పండితులు చెబుతారు.

దీని వెనుక ఉన్న వాస్తు రహస్యం ఏమిటంటే.. నీరు ప్రవహించే ప్రతికూల శక్తిని అడ్డుకుని, సానుకూల శక్తిని లోపలికి పంపిస్తుంది. తులసి దళాలు గాలిని శుద్ధి చేస్తాయి. ఇంటి లోపలికి వచ్చే వ్యక్తుల నెగటివ్ ఎనర్జీని ఈ నీరు గ్రహిస్తుంది. అయితే, ఈ నీటిని సాయంత్రం లోపే మార్చాలి లేదా మరుసటి రోజు ఉదయం కచ్చితంగా తాజా నీటిని నింపాలి. ఇది మీ ఇంటికి లక్ష్మీ దేవిని కూడా ఆహ్వానిస్తుంది.

సింహద్వారం పైన స్వస్తిక్ గుర్తును ఉంచడం వల్ల సకల శుభాలు కలుగుతాయట. స్వస్తిక్ అనేది గణపతికి ,లక్ష్మీ దేవికి ప్రతిరూపం. చాలా మంది పసుపు లేదా సింధూరంతో ఈ గుర్తును వేస్తుంటారు. దీనితో పాటు శంఖం లేదా చక్రం వంటి చిహ్నాలు ఉన్న స్టిక్కర్లు కానీ ప్రతిమలను కానీ తగిలించడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది.

House Entrance

ఈ చిహ్నాలు ఇంటి మీద పడే ‘నరదృష్టి’ని తగ్గిస్తాయి. శాస్త్రీయంగా చూస్తే, ఇలాంటి పవిత్రమైన గుర్తులను చూడగానే మన మెదడులో సానుకూల ఆలోచనలు కలుగుతాయట. దీని ద్వారా ఇంటికి వచ్చే వారు కూడా మంచి మనసుతో లోపలికి అడుగుపెడతారు. ఇది ఇంటి యజమాని ఆర్థిక వృద్ధికి పరోక్షంగా తోడ్పడుతుందని పండితులు అంటారు.

నిత్య దీపారాధన , పసుపు గడప..మహాలక్ష్మి దేవికి అత్యంత ఇష్టమైనది జ్యోతి. సాయంత్రం వేళల్లో కానీ ముఖ్యమైన పర్వదినాలలో కానీ సింహద్వారం వద్ద రెండు వైపులా ప్రమిదలలో దీపాలు వెలిగించడం వల్ల దారిద్ర్యం పారిపోతుంది. అలాగే నిత్యం గడపకు పసుపు రాయడం, కుంకుమతో అలంకరించడం అనేది లక్ష్మీ కటాక్షానికి ప్రధాన మార్గం.

పసుపు సహజమైన యాంటీబయాటిక్ అన్న విషయం తెలిసిందే. ఇది క్రిమికీటకాలను లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. అదే సమయంలో పసుపు రంగు గురు గ్రహానికి ప్రతీక. గురువు అనుగ్రహం ఉంటేనే ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి గడపను పసుపుతో నిత్యం పూజించే ఇళ్లలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయట.అలాగే మామిడి ఆకుల తోరణం కూడా ఇంటికి వచ్చే ప్రాణవాయువును శుద్ధి చేస్తుంది.

అంతేకాదు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు కూడా ఉన్నాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. గుమ్మం వద్ద ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు. సూర్యాస్తమయం కాగానే అక్కడ వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అలాగే సింహద్వారం తలుపులు వెనుక వైపున గోడకు తగలకుండా చిన్న స్టాపర్ వాడటం మంచిది. తలుపులు తెరిచేటప్పుడు వచ్చే శబ్దం ఇంటికి అరిష్టం. సింహద్వారం ఎదురుగా అద్దం కానీ, చెప్పుల స్టాండ్ కానీ ఉండకూడదు, ఎందుకంటే అది లోపలికి వచ్చే అదృష్టాన్ని వెనక్కి పంపేస్తుంది.

పరిశుభ్రమైన గుమ్మం, పవిత్రమైన చిహ్నాలు, నీటి పాత్ర.. ఈ మూడు మీ సింహద్వారం(House Entrance) వద్ద ఎప్పుడూ ఉంటే, ఆ ఇల్లు ఒక దేవాలయంలా మారుతుందట. ఆ ఇంట్లో లక్ష్మీ దేవి శాశ్వతంగా నివసిస్తుంది. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి, కుటుంబంలో ఆనందం నిండాలంటే ఈ చిన్నచిన్న మార్పులు చేసి చూడండి.

Minimalism: వస్తువుల మోజులో పడి ప్రశాంతతను కోల్పోతున్నారా? మినిమలిజంతో మీ జీవితాన్ని మార్చుకోండి!

Exit mobile version