Akhanda Deepam : అఖండ దీపం వెలిగించడంలో అంతరార్ధం ఇదా?
Akhanda Deepam : అఖండ దీపం అంటే జ్వాల ఎప్పుడూ ఆరిపోకుండా, నిరంతరంగా వెలుగుతూ ఉండటం.
Akhanda Deepam
ఆధ్యాత్మిక అభ్యాసంలో , భారతీయ దేవాలయ సంస్కృతిలో అఖండ దీపం (Akhanda Deepam) లేదా నిరంతరం వెలిగించే దీపం అనేది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక మరియు పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.
అఖండ దీపం అంటే జ్వాల ఎప్పుడూ ఆరిపోకుండా, నిరంతరంగా వెలుగుతూ ఉండటం. ఈ నిరంతర కాంతి , వేడి ఆ ప్రాంతంలో స్థిరమైన సానుకూల శక్తి , పవిత్రతను నెలకొల్పుతుందని నమ్మకం. దీపం వెలిగించడానికి ఉపయోగించే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె కాలి, సువాసనతో కూడిన పొగను విడుదల చేస్తుంది. ఈ పొగ వాతావరణాన్ని శుద్ధి చేసి, గాలిలోని సూక్ష్మక్రిములను (Microbes) అరికట్టడంలో సహాయపడుతుంది.

ఆధ్యాత్మికంగా, అఖండ దీపం అనేది జ్ఞానం (Knowledge) ,చైతన్యం (Consciousness) యొక్క నిరంతర ప్రవాహానికి ప్రతీక. స్థిరంగా కదులుతున్న దీపం జ్వాలపై దృష్టి కేంద్రీకరించడం వలన మనస్సు ఇతర ఆలోచనల నుంచి మళ్లి, ఏకాగ్రత (Concentration) పెరుగుతుంది. ఈ ఏకాగ్రత ధ్యాన స్థితికి చేరుకోవడానికి సహాయపడుతుంది.
అఖండ దీపం అనేది దైవ శక్తి యొక్క స్థిరమైన ఉనికిని సూచిస్తుంది. ఇది పూజా మందిరంలో లేదా ధ్యానం చేసే ప్రదేశంలో నిరంతర ప్రశాంతత మరియు పవిత్రతను అందిస్తుంది.



