palms
ఉదయం నిద్రలేవగానే ఏ వస్తువును చూడకముందు మన రెండు అరచేతుల(palms)ను చూసుకోవాలని తర్వాత వాటిని కళ్లకు అద్దుకోవాలని మన పెద్దలు చెబుతారు. దీనిని ‘కరదర్శనం’ అంటారని అంటారు.అలా కరదర్శనం చేసుకుని.. కరాగ్రే వసతే లక్ష్మి.. కరమధ్యే సరస్వతి.. కరమూలే స్థితాగౌరి.. ప్రభాతే కరదర్శనం.. ఈ శ్లోకం చదవాలని అంటారు. శ్లోకం రానివాళ్లు కనీసం రెండు చేతులు చూసుకోవాలని అంటారు. ఎందుకంటే దీని వెనుక ఆధ్యాత్మిక , మానసిక కారణాలు ఉన్నాయంటున్నారు పెద్దలు
మన అర చేతులు(palms) మన కర్మలకు ప్రతీకలు.శ్లోకం ప్రకారం.. చేతి వేళ్ల చివరన లక్ష్మీదేవి (సంపద), మధ్యలో సరస్వతీ దేవి (జ్ఞానం), మణికట్టు భాగంలో పార్వతీ దేవి (శక్తి) ఉంటారని దీని అర్థం.
అంటే మనకు కావాల్సిన సంపద, విద్య, శక్తి అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయని, వాటిని సన్మార్గంలో ఉపయోగించాలని ఈ ఆచారం మనకు ప్రతిరోజూ గుర్తు చేస్తున్నట్లు అన్నమాట. ఏ రోజైనా మనం చేసే పనులకు మనమే బాధ్యులం అవుతాం, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని తెలుసుకోవడం వల్ల బాధ్యతాయుతమైన జీవనం అలవడుతుంది.
సైకలాజికల్ గా చూస్తే, ఉదయం లేవగానే అరచేతులను చూసుకుని.. పాజిటివ్ ఆలోచనలతో రోజును ప్రారంభించడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. మన అరచేతుల్లో అనేక నరాల చివరలు ఉంటాయన్న విషయం తెలిసిందే.
నిద్రలేవగానే వాటిని ఒకదానికొకటి రాసుకుని (Rubbing) కళ్లకు అద్దుకోవడం వల్ల శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ చురుగ్గా మారుతుందట. ఇది మెదడును త్వరగా నిద్ర అవస్థ నుంచి మేల్కొనేలా చేస్తుంది. రోజును ఒక ప్రార్థనతో, ఒక స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభించడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని పెద్దలు చెబుతున్నారు.
Speaker:తెలంగాణలో ఫిరాయింపుల మలుపు..స్పీకర్ తీర్పుతో మారిన సమీకరణాలు
