lighting lamp:ఇంట్లో దీపం వెలిగించడం వెనుకున్న సైన్స్ ఉందా?
lighting lamp: దీనివల్ల వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతమైన నిద్ర పడుతుందని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు.
lighting lamp
హిందూ సంప్రదాయంలో ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడమనే(lighting lamp) ఆచారం తరతరాలుగా వస్తుంది . అయితే ఇది కేవలం భక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు.. దీని వెనుక అద్భుతమైన విజ్ఞాన శాస్త్రం దాగి ఉందని చెబుతున్నారు.
అవును మనం వెలిగించే దీపం(lighting lamp) మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ..శాస్త్రీయంగా విశ్లేషిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయని అంటున్నారు.
ముఖ్యంగా దీపారాధనకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వాడతారు. వీటిని వెలిగించినప్పుడు వెలువడే పొగ గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాను, వైరస్లను నశింపజేస్తుందట.
అలాగే ఆవు నెయ్యి దీపం వెలిగించినప్పుడు గాలిలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని, ఇది శ్వాసకోస సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందని కొన్ని పరిశోధనలు ఇప్పటికే చెబుతున్నాయి. అలాగే నువ్వుల నూనె దీపం వల్ల గాలిలోని కాలుష్యం శుద్ధి అవుతుంది.
అంతేకాకుండా దీపం నుంచి వచ్చే కాంతి తరంగాలు మన మెదడులోని పీనియల్ గ్రంథిని ప్రభావితం చేస్తాయట. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఏకాగ్రతను పెంచడంలో సాయపడతాయట.

అలాగే చీకటిగా ఉన్న గదిలో ఒక చిన్న దీపం వెలిగించి దాని జ్వాలను చూస్తూ ధ్యానం అంటే త్రాటక ధ్యానం చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా, ఆలోచనలు క్రమబద్ధీకరించబడతాయట.
వీటితో పాటు ఇంటి లోపల దీపం వెలిగించడం వల్ల వెలువడే సానుకూల శక్తి (Positive Energy), ఇంట్లోని నెగటివ్ వైబ్రేషన్లను అడ్డుకుంటుందట. అందుకే సంధ్యా సమయంలో దీపం వెలిగించడం మంచిదంటారు. దీనివల్ల వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతమైన నిద్ర పడుతుందని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు.
India : రాకెట్ ఫోర్స్ కమాండ్ పై భారత్ ఫోకస్..పాక్ కు బుద్ధి చెప్పడానికి రెడీ



