Karma:కర్మ సీక్రెట్ ఏంటి?మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు మన జీవితాన్ని మారుస్తాయా?
Karma:చిన్న మంచిపని చేసినా వెంటనే దాని ఫలితం కనిపించకపోయినా, ఒక రోజు అది ఆశ్చర్యం కలిగించే విధంగా మనకు తిరిగి లభిస్తుంది.
Karma
మనకు మంచి జరగాలి అంటే మనం చేసే పనుల్లో (Actions) కూడా మంచి ఉండాలి అని చెబుతాయి పురాణాలు. కర్మ (Karma) అన్నది పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడం కాదు.. అది రోజువారీ చిన్న పనుల్లో మన మనసు (Intention) ఎలా ఉంటుందో దానిపై ఆధారపడి ఉంటుందని వివరిస్తాయి..
ఎవరికైనా సహాయం చేయడం, ఎవరి గురించి చెడు అనిపించినా మాట్లాడకుండా మౌనం పాటించడం, చిన్న చిన్న తప్పులను క్షమించడం ..ఇవి చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ ఈ చర్యలు బ్రహ్మాండంలో మన చుట్టూ ఒక పాజిటివ్ సర్కిల్‌ను సృష్టిస్తాయి.
మంచి కర్మ మన ఆరోగ్యం , మానసిక శాంతి, సంబంధాలు, పనుల్లో విజయం .. అన్నింటిలో ప్రభావం చూపుతుంది.
మనం ఇచ్చే ఎనర్జీ ఏది ఉంటుందో, అదే చివరకు మనకే తిరిగి వస్తుంది. అందుకే చిన్న మంచిపని చేసినా వెంటనే దాని ఫలితం కనిపించకపోయినా, ఒక రోజు అది ఆశ్చర్యం కలిగించే విధంగా మనకు తిరిగి లభిస్తుంది.
ఎప్పుడూ కోపం, ఈర్ష్య (Jealousy), నెగటివిటీ (Negativity)తో స్పందించే వారు ఏదో ఒకరోజు ఒంటరిగా (Lonely) ఫీలవుతారు. కానీ చిన్న చిన్న మంచిపనులు, ఎవరి కోసం కాకుండా, మనసు కోసం చేసిన పనులు మన జీవితంలో పెద్ద మార్పులకు (Big Changes) దారితీస్తాయి. కర్మ నెమ్మదిగా పనిచేస్తుంది, కానీ అది ఎప్పుడూ తప్పు దిశలో పని చేయదని అంతా గుర్తు పెట్టుకోవాలి.
మనకు మంచి జరగాలి అనుకుంటాం. కానీ మన పనుల్లో, మన మాటల్లో, మన వైబ్‌లో నెగటివిటీ ఉంటే Karma కూడా అదే దిశలో పనిచేస్తుంది. మనం ఎవరినైనా బాధపెట్టడం, మోసం చేయడం, వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడం, ఈర్ష్యతో మాట్లాడడం, మనసులో కోపాన్ని పెంచుకోవడం—ఇవి చిన్న తప్పులా కనిపించినా, బ్రహ్మాండం ఇవన్నీ రికార్డ్ చేసుకుంటుంది.
ఎవరూ చూడకపోయినా మన కర్మ (Karma)మాత్రం చూస్తుంది.ఒకరోజు… అతి అనుకున్న సమయంలో… అదే నెగటివిటీ మన జీవితంలో తిరిగి వస్తుంది.

చెడుకర్మ (Karma) వల్ల మనసు ఎప్పుడూ ఒత్తిడిలో పడుతుంది. ఏ పని చేయాలన్నా ఫోకస్ ఉండదు. మన చుట్టూ ఉన్నవాళ్లు దూరమవుతారు. ఎందుకంటే మన ఎనర్జీ వారిని కూడా ప్రభావితం చేస్తుంది. మనమే మనల్ని ఒంటరిగా తయారుచేసుకుంటాం.
నెగటివ్ వైబ్‌తో జీవించే వాళ్లకి జీవితంలో చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది. చిన్న తప్పు జరిగినా “నా దౌర్భాగ్యం” అని ఫీల్ అవుతారు. అసలు సమస్య బయట కాదు… మన కర్మ (Karma) లోనే మొదలవుతుంది.
కర్మా సింపుల్ రూల్ ఒకటే:మనసులో ఏమి పెంచుతామో… అది తిరిగి మనకే వచ్చి తగులుతుంది.
ఎవరినైనా బాధ పెట్టి ముందు రోజు సంతోషంగా ఉన్నా, ఒకరోజు మనసు మనల్ని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నలకే సమాధానం దొరకకపోతే… అది మానసికంగా పెద్ద బరువుగా మారుతుంది.
అందుకే మంచి కర్మ (Karma)a చేయడం అనేది ఎవరికోసం కాదు… మన జీవితమే స్మూత్‌గా నడవడానికి కావాలి.
స్మాల్ పాజిటివ్ యాక్షన్స్ .. చిన్న క్షమలు, చిన్న సహాయం, చిన్న మంచిపని, చిన్న మాటలో ప్రేమ— ఇవి మన జీవితం మీద పెద్ద పాజిటివ్ షీల్డ్‌లా పనిచేస్తాయి.
మంచి కర్మ వెంటనే ఫలితం చూపకపోయినా… ఒక్కరోజు మనం ఊహించని రీతిలో మనకు తిరిగి వస్తుంది. చెడుకర్మ కూడా అదే… కానీ నెగటివ్‌గా తిరిగి వస్తుంది.
మన చేతే మన జీవితం ఎలా ఉండాలో క్రియేట్ చేసుకోవచ్చు..మంచి రాస్తామా… చెడు రాస్తామా… ప్రతి లైన్‌ను కర్మ నే ఫిక్స్ చేస్తుంది.



