Just SpiritualLatest News

Eclipse: నేడే చంద్రగ్రహణం: సూతక కాలం, నియమాలు, చేయాల్సిన పనులు

Eclipse: గ్రహణానికి ముందు ఒక ప్రత్యేకమైన కాలాన్ని సూతక కాలం లేదా అశుద్ధి కాలం అంటారు. చంద్ర గ్రహణానికి సూతక కాలం 9 గంటల ముందు మొదలవుతుంది.

Eclipse

సెప్టెంబర్ 7, 2025న ఒక అరుదైన ఖగోళ సంఘటన జరగబోతోంది. ఆ రోజున పూర్ణ చంద్రగ్రహణం (Full Lunar Eclipse) ఏర్పడుతుంది. ఈ గ్రహణం మీనం రాశిలో జరుగుతుంది. భారతీయ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహణం సమయంలో , ఆ తర్వాత చేసే పుణ్యకార్యాలు, దానాలు నూరింతలు ఫలితాలను ఇస్తాయి. ఈ గ్రహణం యొక్క సమయాలు, అది కనిపించే ప్రాంతాలు,వివిధ రాశుల వారు పాటించాల్సిన నియమాలను తెలుసుకుందాం.

eclipse
eclipse

గ్రహణం యొక్క సమయాలు …

  • పెనంబ్రల్ గ్రహణ ప్రారంభం: రాత్రి 8:58 గంటలు
  • పాక్షిక చంద్రగ్రహణం(eclipse) ప్రారంభం: రాత్రి 9:57 గంటలు
  • పూర్ణ చంద్రగ్రహణం(eclipse) ప్రారంభం: రాత్రి 11:12 గంటలు
  • గ్రహణ గరిష్ట స్థితి: రాత్రి 11:42 గంటలు
  • పూర్ణ గ్రహణం ముగింపు: అర్ధరాత్రి 12:13 గంటలు (సెప్టెంబర్ 8)
  • పాక్షిక గ్రహణం ముగింపు: అర్ధరాత్రి 1:28 గంటలు (సెప్టెంబర్ 8)
  • పెనంబ్రల్ గ్రహణం ముగింపు: తెల్లవారుజామున 2:26 గంటలు (సెప్టెంబర్ 8)

ఈ పూర్ణ చంద్రగ్రహణం(eclipse) భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, తూర్పు ఆఫ్రికా, ఆసియా ,ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో పూర్తిగా కనిపిస్తుంది. యూరప్, ఆఫ్రికా, పసిఫిక్ , తూర్పు అమెరికాలో పాక్షికంగా కనిపించనుంది.

eclipse
eclipse

సూతక కాలం – నియమాలు, ఆచారాలు:

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, గ్రహణానికి ముందు ఒక ప్రత్యేకమైన కాలాన్ని సూతక కాలం లేదా అశుద్ధి కాలం అంటారు. చంద్ర గ్రహణానికి సూతక కాలం 9 గంటల ముందు మొదలవుతుంది. ఈ సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల గ్రహణ ప్రభావాల నుండి రక్షణ పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

  • సూతక కాలం ప్రారంభం: మధ్యాహ్నం 12:57 PM (సెప్టెంబర్ 7)
  • సూతక కాలం ముగింపు: తెల్లవారుజామున 2:26 AM (సెప్టెంబర్ 8)

చేయకూడని పనులు..

సూతక కాలం ప్రారంభమయ్యాక ఆహారం తీసుకోవడం, వంట చేయడం మానుకోవాలి. అయితే, చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఉంటుంది.వండిన ఆహార పదార్థాలను కాపాడుకోవడానికి వాటిలో తులసి ఆకులు లేదా గరిక వేయడం మంచిది.గ్రహణ సమయంలో దైవారాధన, పూజలు, నైవేద్యం పెట్టడం వంటివి చేయకూడదు. ఆలయాలను కూడా మూసివేస్తారు. ఈ సమయంలో శారీరక సంబంధాలకు దూరంగా ఉండాలి.

గర్భిణీలకు ప్రత్యేక జాగ్రత్తలు..

గర్భిణీలు గ్రహణ సమయంలో కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను వాడకూడదు.పడుకోకుండా దైవ నామాన్ని స్మరించుకోవడం ఉత్తమం. శివ నామం, విష్ణు సహస్ర నామం, లలితా సహస్ర నామం పఠించడం మంచిది.తమ కడుపుపై తులసి ఆకు లేదా గరికను ఉంచుకోవడం వల్ల గ్రహణ ప్రభావం నుంచి రక్షణ ఉంటుందని చెబుతారు.

చేయవలసిన పనులు..

గ్రహణం సమయంలో గాయత్రీ మంత్రం, మృత్యుంజయ మంత్రం లేదా శివ పఠనాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
గ్రహణం ముగిసిన వెంటనే శుభ్రంగా స్నానం చేయాలి.గ్రహణ కాలంలో, అనంతరం దానం చేయడం, మంత్ర జపం చేయడం, పితృ తర్పణం వంటివి చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలం లభిస్తుంది.

గ్రహణానంతరం శుద్ధి కర్మలు:

గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి.ఇంటిని గోమయం లేదా గంగ జలంతో శుద్ధి చేయాలి.దేవాలయాల్లో పునఃప్రాణ ప్రతిష్ఠ లేదా పునఃపూజ చేయాలి.దాన ధర్మాలు చేయడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి.

రాశి వారీగా చేయాల్సిన దానాలు..

గ్రహణం మీనం రాశిలో జరుగుతుండటంతో.. ఆయా రాశుల వారు ప్రత్యేక దానాలు చేయడం ద్వారా గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు , పాప శాంతిని పొందొచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహణ కాలంలో కానీ, ఆ తర్వాత కానీ ఈ దానాలు చేయడం వల్ల శతగుణ ఫలితం లభిస్తుంది.

  • మేషం (Aries): ఎర్ర వస్త్రాలు, మిరియాలు, తామర పుష్పాలు.
  • వృషభం (Taurus): తెల్ల శనగలు, పాలు, వెండి.
  • మిథునం (Gemini): పుస్తకాలు, ఆకుపచ్చ దుస్తులు, యాలుకలు.
  • కర్కాటకం (Cancer): పాలు, తెల్ల వస్త్రాలు, చందనం.
  • సింహం (Leo): గోధుమలు, నారింజ రంగు వస్త్రాలు, తామ్ర పాత్ర.
  • కన్య (Virgo): పుస్తకాలు, తెల్ల ద్రాక్ష.
  • తులా (Libra): అలసందలు, వెండి, పూలు.
  • వృశ్చికం (Scorpio): కందులు, నల్ల బుట్టలు.
  • ధనుస్సు (Sagittarius): పసుపు, ధాన్యం, పుస్తకాలు.
  • మకరం (Capricorn): నువ్వులు, నల్ల దుస్తులు, ఉల్లిపాయలు, ఇనుప పాత్రలు.
  • కుంభం (Aquarius): నల్ల శనగలు, నల్ల దుస్తులు.
  • మీనం (Pisces): పసుపు కుంకుమ, దంపతులకు వస్త్రదానం, గోధుమలు.

Allu Arjun :సైమా వేదికపై మెరిసిన అల్లు అర్జున్..వరుసగా మూడోసారి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button