Just SpiritualJust LifestyleLatest News

Snake plant :మీ ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉండాల్సిందే – వాస్తు ప్రకారం ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

Snake plant : స్నేక్ ప్లాంట్ ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా, వాస్తు శాస్త్రం (Vastu Shastra) ప్రకారం ఇంట్లో సానుకూలతను కూడా తెస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Snake plant

ఇంట్లో అందాన్ని పెంచడానికి , గాలిని శుభ్రంగా ఉంచడానికి ఇండోర్ మొక్కలు (Indoor Plants) పెంచడం ఇప్పుడు ట్రెండ్‎గా మారింది. ఇందులో స్నేక్ ప్లాంట్ (Snake Plant) అందరికీ అత్యంత ఇష్టమైనదిగా మారింది. ఈ మొక్క ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా, వాస్తు శాస్త్రం (Vastu Shastra) ప్రకారం ఇంట్లో సానుకూలతను కూడా తెస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల అందంతో పాటు జీవితంలో ఆనందం, శ్రేయస్సు నిండుతాయని చెబుతున్నారు.

స్నేక్ ప్లాంట్ యొక్క వాస్తు , ఆర్థిక ప్రయోజనాలు..

  • వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో స్నేక్‌ ప్లాంట్‌ పెంచుకోవడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఇది సంపద , శ్రేయస్సుకు మార్గాన్ని తెరుస్తుందని నమ్ముతారు.
  • ఈ మొక్కను ముఖ్యంగా దక్షిణ దిశలో ఉంచడం ద్వారా, దాని ప్రభావం మరింత శక్తివంతంగా మారుతుంది . అంతేకాదు ఇంట్లో ఆనందాన్ని, సంపదను ఆకర్షిస్తుంది.
  • మీరు మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పురోగతి (Career Advancement) కోరుకుంటే, స్నేక్‌ప్లాంట్‌ను పెంచుకోవచ్చు. ఇది భద్రతను పెంచి, మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది.
  • ఈ మొక్క ఇంటి నుంచి ప్రతికూల శక్తిని (Negative Energy) దూరంగా ఉంచుతుంది అలాగే సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. ఇది ఇంట్లో ఆనందం, శాంతిని తెచ్చి, కుటుంబ సభ్యుల మనస్సు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
  • స్నేక్ ప్లాంట్ యొక్క స్థానం (Placement).. సాధారణంగా స్నేక్‌ ప్లాంట్‌ను తలుపు లేదా ప్రధాన ద్వారం (Main Entrance) దగ్గర ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
  • టేబుల్ లేదా క్యాబినెట్ పైన వంటి ఎత్తైన ప్రదేశంలో ఉంచడం వల్ల కూడా ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి.
    ఈ మొక్కను టాయిలెట్ నుంచి దూరంగా ఉంచాలి. ఎందుకంటే అక్కడ నుంచి వెలువడే ప్రతికూల శక్తి దాని సహజ శక్తిని ప్రభావితం చేయొచ్చు.
  • ఈ మొక్కను ప్రత్యక్ష కాంతి పడేలా కిటికీ దగ్గర ఉంచడం మంచిది.
Snake plant
Snake plant

స్నేక్ ప్లాంట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు..

  • స్నేక్ ప్లాంట్ ఒక సహజ గాలి శుద్ధి చేసే (Natural Air Purifier) ఇండోర్‌ మొక్క. ఇది ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది.
  • ఈ మొక్క రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తూనే ఉంటుంది. రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేసే కొన్ని ఇండోర్ ప్లాంట్లలో ఇది ఒకటి.
  • ఈ మొక్కను ఇంటి లోపల ఉంచడం వల్ల ఒత్తిడి (Stress) తగ్గి, మంచి నిద్ర వస్తుంది.
  • ఈ మొక్కలు తక్కువ నీరు , తక్కువ కాంతితో కూడా జీవించగలవు కాబట్టి, వీటిని నిర్వహించడం చాలా సులభం.
  • ఈ విధంగా, స్నేక్ ప్లాంట్ ఇంటి అలంకరణకే కాకుండా, మీ జీవితంలో ఆర్థిక , కెరీర్ పరంగా సానుకూల మార్పులను తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button