IPL 2026 : చిన్నస్వామిలోనే ఐపీఎల్ మ్యాచ్‌లు..ఆర్సీబీకి బిగ్ రిలీఫ్

IPL 2026 : ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఆనందాన్నిస్తూ బెంగళూరు చిన్నస్వామి స్డేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చింది

IPL 2026

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) సీజన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి భారీ ఊరట లభించింది. ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఆనందాన్నిస్తూ బెంగళూరు చిన్నస్వామి స్డేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికి సంబంధించి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.  కొన్ని రోజులుగా ఈ అనుమతి కోసం కర్ణాటక క్రికెట్ సంఘం అధికారులు ప్రభుత్వంతో ఎడతెరపిలేని విధంగా చర్చలు జరుపుతున్నారు.

ఒక దశలో అనుమతి ఇక వచ్చేది లేదని కూడా చాలా మంది అనుకున్నారు. అటు ఆర్సీబీ ఫ్రాంచైజీ కూడా కొత్త హోం గ్రౌండ్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే కర్ణాటక క్రికెట్ సంఘం కొత్త ప్రెసిడెంట్ గా వెంకటేశ్ ప్రసాద్ ఎన్నికైన తర్వాత ఐపీఎల్ మ్యాచ్ లు, అంతర్జాతీయ మ్యాచ్ ల నిర్వహణను మళ్లీ తీసుకురావాలని పట్టుదలను ప్రదర్శించి సక్సెస్ అయ్యారు. ప్రభుత్వం సూచించిన పలు సూచనలు, నిబంధనలను అనుసరిస్తూ మ్యాచ్ లు నిర్వహించబోతున్నారు.

గతేడాది ఐపీఎల్(IPL)  టైటిల్ ను గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ పరేడ్ ను నిర్వహించడం విషాదానికి దారితీసింది. ఈ పరేడ్ కు భారీగా అభిమానులు తరలిరావడం, అనుకున్న రీతిలో ఏర్పాట్లు లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 51 మంది గాయపడ్డారు. అప్పట్లోనే ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని ఒకవైపు, ఫ్రాంచైజీ సరిగ్గా ఈవెంట్ నిర్వహించలేకపోయాయని మరోవైపు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.

IPL 2026

 

ఈ కేసును సుమోటాగా తీసుకున్న అక్కడి హైకోర్టు నిర్వాహకులపై కేసులు నమోదు చేసింది. ఘటనపై పూర్తి విచారణ కోసం జ్యుడీషియల్ కమిటీని కూడా నియమించింది. దీంతో విచారణ జరిపిన కమిటీ మ్యాచ్ ల నిర్వహణకు చిన్నస్వామి సురక్షితం కాదని నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం అక్కడ క్రికెట్ మ్యాచ్ లను నిషేధించింది. దీంతో మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ ల ఆతిథ్య అవకాశాన్ని చేజార్చుకుంది.

అయితే ఇప్పుడు కొన్ని కీలక ఆంక్షలు నడుమ ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ మ్యాచ్ ల ఆతిథ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Japanese:జపాన్‌ ప్రజల లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ సీక్రెట్ ఇదేనట.. మీరూ ట్రై చేయండి..

Exit mobile version