Just EntertainmentLatest News

Toxic:మార్చి రేసు నుంచి తప్పుకున్న రాకీ భాయ్.. వాయిదా పడ్డ టాక్సిక్..

Toxic: ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టాక్సిక్ మూవీ మార్చి 19న థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది.

Toxic

కేజీఎఫ్ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ టాక్సిక్(Toxic).. రిలీజ్ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది.

అయితే అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల వల్ల.. మేకర్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్తతలతో పాటు యుద్ధ వాతావరణం వల్ల మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అఫీషియల్‌గా ప్రకటించింది.

దీని గురించి విడుదల చేసిన అధికారిక నోట్‌లో టాక్సిక్(Toxic) మూవీని జూన్ 4వ తేదీకి రీ-షెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు. సుమారు మూడు నెలల పాటు సినిమా పోస్ట్‌పోన్ అవడంతో యష్ ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతున్నా కూడా.. సినిమా అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకుండా పక్కా ప్లానింగ్‌తో రావాలనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Toxic
Toxic

కన్నడ ప్రతిభావంతురాలు గీతూ మోహన్ దాస్ డైరక్షన్లో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ , పోస్టర్స్ ఈ మూవీ కేజీఎఫ్‌ను మించిన యాక్షన్ డ్రామాగా ఉండబోతోందన్న హైప్‌ను తీసుకువచ్చాయి.

యష్ క్రేజ్‌కు తగ్గట్టుగా హై వోల్టేజ్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. యుద్ధ మేఘాల వల్ల మార్చి రేసు నుంచి తప్పుకున్న ఈ టాక్సిక్ ప్రభంజనం, సమ్మర్ ముగిశాక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button