Just SportsLatest News

T20: సఫారీల దెబ్బకు దెబ్బ.. రెండో టీ20లో భారత్ ఓటమి

T20: ఊహించినట్టుగానే తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో నంజూ శాంసన్ కు మరోసారి నిరాశే మిగిలింది.

T20

తొలి టీ20(T20) గెలిచి జోష్ మీదున్న భారత్ కు సౌతాఫ్రికా షాకిచ్చింది. రెండో టీ20(T20) గెలిచి లెక్క సరిచేసింది. బ్యాటింగ్ లో క్వింటన్ డికాక్ నూపర్ షోతో భారీస్కోరు చేసిన నఫారీలు తర్వాత బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో టీమిండియాను కట్టడి చేశారు. భారత కీలక బ్యాటర్లందరూ ఫ్లాప్ అయ్యారు. ఈ మ్యాచ్ లో
పిచ్ పరిస్థితి, మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకున్న భారత్ టాన్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఊహించినట్టుగానే తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో నంజూ శాంసన్ కు మరోసారి నిరాశే మిగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్, మరో ఓపెనర్ హెండ్రిక్స్ కాన్ఫిడెంట్ గానే ఇన్నింగ్స్ ప్రారంభించారు. తొలి వికెట్ కు 38 పరుగులు జోడించారు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మార్క్ క్రమ్ తో కలిసి డికాక్ తన సూపర్ బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. భారీ సిక్సర్లతో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.

హోం గ్రౌండ్లో అర్షదీప్ సింగ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తనపై ఉన్న అంచనాలకు భిన్నంగా భారీగా వరుగులిచ్చేశాడు. ఒక ఓవర్లో అయితే ఏకంగా 7 వైడ్లు వేశాడు. అటు మరో షేనర్ బూమ్రా సైతం భారీగా వరుగులు ఇచ్చాడు. డికాక్, మార్క్ క్రమ్ రెండో వికెట్కు 83 వరుగులు జోడించారు. మార్క్క్రమ్, బ్రెవిస్ ఔటైనా డికాక్ జోరు కొనసాగించాడు. కేవలం 46 బంతుల్లోనే 90 వరుగులతో అదరగొట్టాడు. డికాక్ ఔటైన తర్వాత ఫెరీరా 16 బంతుల్లో 30, డేవిడ్ మిల్లర్12 బంతుల్లో 20 రన్స్ తో మెరుపులు మెరిపించారు. దీంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. భారత బౌలర్లతో అర్షిదీప్. బూమ్రా ఫెయిలనగా.. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశాడు.

T20
T20

214 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ కు తొలి ఓవర్లోనే పాక్ తగిలింది. పేలన ఫామ్ తో నతమతమవుతున్న గిల్ డకౌటయ్యాడు. అటు అభిషేక్ శర్మ 2 సిక్సర్లతో దూకుడు కనబరిచినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. నూర్యకుమార్ యాదవ్ కూడా మరోసారి ఫ్లాప్ అయ్యాడు. దీంతో పవర్ ప్లేలోనే భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. వన్ డౌన్ లో అక్షర్ పటేల్ ను దింపగా అనుకున్నంత వేగంగా ఆడలేకపోయాడు.

21 పరుగులు చేసి ఔటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ వాటిగా ఆడాడు. నసారీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా తన మ్యాజిక్ చూపించేలా కనిపించినా కీలక సమయంలో ఔటవడం కొంపముంచింది.

ఫినిషర్ అంచనాలు పెట్టుకున్న జితేశ్ శర్మ భారీ పాట్లతో అలరించినా అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. మరొక ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ వృథా అయింది. అతనికి మరొకరు నపోర్ట్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. తిలక్ వర్మ ఆఖరి వికెట్ గా ఔటయ్యాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ కు 162 పరుగుల దగ్గర తెరపడింది. నఫారీ బౌలర్లలో బార్ట్ మన్ 4 వికెట్లు తీయగా.. ఎంగిడి, యెన్సన్, సిమాప్లా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో నమంగా ఉంది. సిరీస్(T20) లో మూడో మ్యాచ్ ఆదివారం ధర్మశాలలో జరుగుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button