Just SportsLatest News

T20 World Cup : టీ20 వరల్డ్ కప్… ఐపీఎల్..ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ధనాధన్

T20 World Cup : మొదట టీ 20 ప్రపంచకప్.. ఆ తర్వాత ఐపీఎల్.. అంటే ఫిబ్రవరి 7 నుంచి మే చివరి వరకూ ఫ్యాన్స్ కు పండగే పండగే. అది కూడా భారత్ లోనే ఈ ఎంటర్ టైన్ మెంట్ జరుగుతుండడం మరింత జోష్ పెంచుతోంది.

T20 World Cup

క్రికెట్ అభిమానులకు ఇక నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్… తాము ఎంతగానో ఇష్టపడే టీ ట్వంటీ ఫార్మాట్ ను నాలుగు నెలల పాటు ఆస్వాదించే బంపర ఛాన్స్… మొదట టీ 20 ప్రపంచకప్(T20 World Cup).. ఆ తర్వాత ఐపీఎల్.. అంటే ఫిబ్రవరి 7 నుంచి మే చివరి వరకూ ఫ్యాన్స్ కు పండగే పండగే. అది కూడా భారత్ లోనే ఈ ఎంటర్ టైన్ మెంట్ జరుగుతుండడం మరింత జోష్ పెంచుతోంది.

టీ20 ప్రపంచకప్ కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండగా.. సెమీఫైనల్స్, ఫైనల్స్ తో పాటు లీగ్ స్టేజ్ లో చాలా వరకూ ప్రధాన మ్యాచ్ లన్నీ భారత గడ్డపైనే జరగనున్నాయి. దీంతో అభిమానులు అసలు సిసలు టీ ట్వంటీ కిక్కును ఎంజాయ్ చేయడం ఖాయం. ముందుగా ఐసీసీ

టీ20 ప్రపంచకప్(T20 World Cup) చూసుకుంటే ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతోంది. మార్చి 8 వరకూ మొత్తం 55 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సారి 20 జట్లు పాల్గొంటుడడంతో నెల రోజుల పాటు ప్రతీ రోజూ మూడేసి మ్యాచ్ లు ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా మరోసారి ట్రోఫీ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంటే.. గత ఎడిషన్ లో తృటిలో చేజారిన టైటిల్ ను ఈ సారి అందుకోవాలని సఫారీలు ఎదురుచూస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లతో పాటు సంచలనాలకు చిరునామా ఆప్ఘనిస్తాన్ కూడా అదరగొట్టేందుకు సిద్ధమైంది. ఉపఖండపు పిచ్ లు కావడంతో బ్యాటర్ల ఆధిపత్యం కనబరిచే అవకాశముంది.

T20 World Cup
T20 World Cup

మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26 నుంచి మొదలవుతుంది. అంటే వరల్డ్ కప్ ముగిసిన రెండు వారాల గ్యాప్ తో ఈ టీ ట్వంటీ కార్నివాల్ షురూ అవుతుంది. 18 ఏళ్లుగా క్రికెట్ అభిమానులకు సమ్మర్ లో పూర్తి వినోదాన్ని అందిస్తున్న ఐపీఎల్ ఈ సారి మరింత కొత్తగా కనిపించబోతోంది. ఎందుకంటే వేలంలో చాలా జట్ల కూర్పు మారిపోయింది. అందుకే ఏ జట్టు ఫేవరెట్ , ఏ జట్టు బలహీనంగా ఉందన్న విషయాలు ఇప్పుడే అంచనా వేయలేం.

అయితే కొన్ని జట్లలో కీలక ఆటగాళ్లు సైతం మరొక జట్టుకు వెళ్లిపోవడం, కొత్త కెప్టెన్లు రావడంతో ఇలా అంతా కొత్తకొత్తగానే ఉంది. దీంతో ఈ సారి డబుల్ ఎంటర్ టైన్ మెంట్ ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి షెడ్యూల్ ఇంకా రాకపోయినా ఓవరాల్ గా దేశంలోని మేజర్ మెట్రో నగరాల్లో ఐపీఎల్ హంగామా ఉండబోతోంది.

Dehydration:పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. డీహైడ్రేషన్ బారిన పడే ఛాన్స్ ఉందా?

Related Articles

Back to top button