Just SportsLatest News

Under19 World Cup : ఆరోసారి టైటిల్ పట్టేస్తారా ?..ఇంగ్లాండ్ తో భారత్ టైటిల్ ఫైట్

Under19 World Cup : ఈ టోర్నీ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు ఉన్న భారత్ ఆరోసారి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది

Under19 World Cup

అండర్ 19 ప్రపంచకప్(Under19 World Cup) ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. హరారే వేదికగా శుక్రవారం భారత్ , ఇంగ్లాండ్ టైటిల్ కోసం తలపడబోతున్నాయి. ఈ టోర్నీ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు ఉన్న భారత్ ఆరోసారి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. అటు 1998 తర్వాత తొలిసారి వరల్డ్ కప్ గెలవాలని ఇంగ్లాండ్ ఉవ్విళ్లూరుతోంది. నిజానికి ఈ టోర్నీలో భారత్, ఇంగ్లాండ్ మాత్రమే ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ కు చేరుకున్నాయి.

టైటిల్ ఫేవరెట్ అంచనాలకు తగ్గట్టుగానే భారత యువ జట్టు ఫైనల్ వరకూ అదిరిపోయే ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా సెమీస్ లో రికార్డులను తిరగరాస్తూ 311 పరుగులను ఛేజ్ చేసింది. బ్యాటింగ్ లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపుతున్నాడు. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ మెరుపులను మెరిపిస్తున్నాడు. సెమీస్ లోనూ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అతనితో పాటు ఆరోన్ జార్జ్ , కెప్టెన్ ఆయుశ్ మాత్రే కూడా ఫామ్ అందుకున్నారు.

హైదరాబాదీ కుర్రాడు ఆరోన్ జార్జ్ సెంచరీతో రెచ్చిపోతే.. మాత్రే కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. వీరితో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే భారీస్కోరు ఖాయం. అటు బౌలింగ్ లోనూ భారత్ సత్తా చాటుతోంది. పేస్ విభాగం లో జదీశ్ , హెనిల్ పటేల్ , అంహరీష్ లతో పటిష్టంగా ఉంది. స్పిన్నర్లు కనిష్క చౌహాన్, ఖిలాన్ పటేల్ కూడా కీలక సమయాల్లో వికెట్ల తీస్తున్నారు.

Under19 World Cup
Under19 World Cup

మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కూడా బ్యాటింగ్, బౌలింగ్ లలో పటిష్టంగా ఉంది. బెన్ మేయస్ 399 పరుగులతో టోర్నీలోనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. అటు ఇంగ్లాండ్ అండర్ 19 జట్టు కెప్టెన్ థామస్ కూడా ఫామ్ లో ఉన్నాడు, అటు పేసర్లు , స్పిన్నర్లు కూడా నిలకడగా రాణిస్తుండడం ఇంగ్లాండ్ కు అడ్వాంటేజ్.

సెమీస్ లో ఆ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్ కు దూసుకొచ్చింది. ఆల్ రౌండ్ షోతో వరుస విజయాలు సాధిస్తున్న ఇంగ్లాండ్ అండర్ 19 ప్రపంచకప్ (Under19 World Cup ) జట్టు చివరిసారిగా 1998లో వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. అటు భారత్ 2022లో టైటిల్ గెలవగా.. గత ఎడిషన్ లో రన్నరప్ తో సరిపెట్టుకుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button