Just InternationalLatest News

Epstein ఎప్‌స్టీన్‌ సెక్స్ కుంభకోణం..ఇంకా చాలా పేర్లు రాబోతున్నాయ్

Epstein : అగ్రరాజ్యం అమెరికాలో వెలుగుచూసిన ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం కేవలం ఆ దేశాన్నే కాదు వేరే దేశాలకు చెందిన ప్రముఖులకు సైతం వణుకు పుట్టిస్తోంది.

Epstein

అగ్రరాజ్యం అమెరికాలో వెలుగుచూసిన ఎప్‌స్టీన్‌(Epstein) సెక్స్‌ కుంభకోణం కేవలం ఆ దేశాన్నే కాదు వేరే దేశాలకు చెందిన ప్రముఖులకు సైతం వణుకు పుట్టిస్తోంది. అసలు ఈ స్కాండిల్ వెలుగు చూసిన తర్వాత, ప్రముఖులందరిపైనా వచ్చిన ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా రేగిన కలకలం అంతా ఇంతా కాదు. ఈ సెక్స్ కుంభకోణంలో వెలుగుచూసిన పేర్లలో క్లింటన్, బిల్ గేట్స్ , ట్రంప్ వంటి వారున్నారు. ప్రస్తుతానికి ఇవి ఆరోపణలే అనుకున్నప్పటకీ ఎప్‌స్టీన్‌ ఫైల్స్(Epstein Files) పేరుతో వరుసగా విడుదలవుతున్న ఫోటోలు, వివరాలు సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి.

ఇప్పట్లో ఈ ఫైల్స్ కు బ్రేక్ పడే అవకాశం లేదు. విడతల వారీగా దీనిని విడుదల చేస్తూనే ఉంటున్నారు. ప్రస్తుతం ఏ దేశంలో చూసినా…ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌(Epstein Files) గురించే చర్చ జరుగుతోంది. ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో ఏ దేశాల అధ్యక్షులు ఉన్నారు ? మైనర్ బాలికలను ఏ దేశాల నుంచి కిడ్నాప్ చేసారు ? ఎప్‌స్టిన్‌ ఐలాండ్‌కు వెళ్లిన సెలబ్రెటీలు ఎవరు వంటి విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకూ అమెరికా న్యాయశాఖ 30 లక్షల ఎప్‌స్టీన్‌ పేజీలను బయటపెట్టగా… వీటిలో 2,000 వీడియోలు, 1,80,000 ఫొటోలు ఉన్నాయి. చనిపోయిన ఎప్‌స్టీన్‌ ఆధ్వర్యంలో మైనరు బాలికలపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే పత్రాలు విడుదల చేయడంతో విస్తుపోయే విషయాలు వెలుగుచూసాయి. అదే సమయంలో బాధిత యువతుల ఫోటోలు, వారి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు, విడుదల చేసిన వీడియోలు, ఫోటోల్లో బాధిత మహిళల ముఖాలు కనబడకుండా బ్లర్ చేసారు. ట్రంప్ సహా కొందరు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు.. ఎప్‌స్టీన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. అయితే కొన్ని ఫైల్స్ తొక్కి పెడుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ట్రంప్ కు చెందిన చాలా ఫైల్స్ పూర్తిగా విడుదల చేయలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Epstein
Epstein

మరోవైపు తాజాగా బిల్ గేట్స్ ఈ స్కాండిల్ పై స్పందించారు.అప్పటి విషయాన్ని గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్ లాంటి వివాదాస్పద వ్యక్తితో తాను గడిపిన క్షణాలపై పశ్చాత్తాపం చెందుతున్నట్టు చెప్పారు. అలాంటి వ్యక్తిని కలిసినందుకు బహిరంగంగానే అందరికీ క్షమాపణలు చెపుతున్నట్టు ప్రకటించారు. అయితే తాను ఎప్‌స్టీన్ రహస్య దీవుల్లా చెబుతున్న ప్రదేశానికి వెళ్లలేదంటూ గేట్స్ చెబుతున్నారు.

బిల్ గేట్స్ రష్యా యువతులను కోరుకున్నారని, వారితో గడిపేందుకు తాను సహకరించానంటూ ఎప్‌స్టీన్ చెప్పుకొచ్చారు. రష్యన్ యువతులతో రహస్య భేటీ తానే ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు. తన భార్యా మిలిండా గేట్స్ కు యాంటీ బయాటిక్స్ కూడా అడిగారని మెయిల్ లో పేర్కొన్నారు. అయితే తాను ఎలాంటి మెయిల్స్ పంపలేదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. దురుద్దేశపూర్వకంగానే ఎప్‌స్టీన్ ఈ ఆరోపణలు చేసి, తన పేరు రాసారంటూ వ్యాఖ్యానించారు. కాగా పారదర్శకంగా వ్యవహరిస్తే మాత్రం ఇంకా చాలమంది సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు రానున్న రోజుల్లో ఇదే కేసులో వెలుగులోకి వస్తాయని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Vastu:మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా? వాటిని సరిదిద్దుకోవడం ఎలా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button