Virat Kohli: నన్నెవడ్రా ఆపేది.. వరల్డ్ కప్ లో ఆడడం పక్కా
Virat Kohli: నిజానికి ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కోహ్లీ ఆసీస్ టూర్ లోనే రీఎంట్రీ ఇచ్చాడు. రెండు వన్డేల్లో వరుసగా డకౌట్లు కావడంతో విరాట్ పనైయిపోయిందంటూ చాలా మంది కామెంట్స్ చేశారు.
Virat Kohli
టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత క్రికెట్ లో భారీ బాదుడే కనిపిస్తోంది. బ్యాటర్ల నుంచి అభిమానులు కూడా భారీ సిక్సర్లు, భారీ షాట్లు మాత్రమే ఆశిస్తున్నారు. ఈ క్రమంలో క్లాసిక్ బ్యాటింగ్ చూసే అవకాశం లేకుండా పోతోంది. అయితే వన్డేల్లో ఇలాంటి క్లాస్ బ్యాటింగ్ ను అభిమానులకు ఎప్పటికప్పుడు రుచి చూపిస్తున్నాడు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)… క్రికెట్ తరచుగా వినిపించే ఫామ్ టెంపరరీ.. క్లాస్ ఈజ్ పర్మిమెంట్ అన్న మాటను ఫాలో అవుతూ సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు.
నిజానికి ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కోహ్లీ ఆసీస్ టూర్ లోనే రీఎంట్రీ ఇచ్చాడు. రెండు వన్డేల్లో వరుసగా డకౌట్లు కావడంతో విరాట్ పనైయిపోయిందంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. తర్వాత మూడో వన్డేతో టచ్ లోకి వచ్చిన రన్ మెషీన్ ఇప్పుడు సౌతాఫ్రికాపై బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఒకప్పటి కోహ్లీని గుర్తు చేస్తూ అతను ఆడిన షాట్లకు అభిమానులే కాదు మాజీలు సైతం ఫిదా అయ్యారు. వింటేజ్ కోహ్లీనా మజాకా అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

వరల్డ్ క్రికెట్ లో సచిన్ తర్వాత రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆటగాడు విరాట్ మాత్రమే. ఎప్పటికప్పుడు పాత రికార్డులను బ్రేక్ చేస్తూ.. కొత్త రికార్డులను అందుకుంటూ తన ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. రాయ్ పూర్ లో శతక్కొట్టిన తర్వాత కోహ్లీ (Virat Kohli)పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో వరుసగా రెండు, అంతకంటే ఎక్కువ శతకాలు అత్యధిక సార్లు నమోదు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ (Virat Kohli)నిలిచాడు. కోహ్లీ మొత్తం 11 సందర్భాల్లో వరుసగా రెండు, అంతకంటే ఎక్కువ శతకాలు నమోదు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో 53 శతకాలు నమోదు చేశాడు. ఓవరాల్‌గా విరాట్ కోహ్లీకి ఇది 84వ సెంచరీ. సచిన్ తర్వాత అత్యధిక శతకాలు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అతని దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. అలాగే సొంతగడ్డపై అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్‌గానూ కోహ్లీ చరిత్రకెక్కాడు.
అన్నింటికంటే ముఖ్యంగా తన రెగ్యులర్ బ్యాటింగ్ ప్లేస్ మూడో నెంబర్ లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. మూడో స్థానంలో కోహ్లీ(Virat Kohli)కి ఇది 46వ సెంచరీ. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే బ్యాటింగ్ ప్లేస్ లో కోహ్లీ తన పరుగుల వరద కొనసాగించాడు. అలాగే 34 వేర్వేరు వేదికల్లో శతకాలు చేసిన ప్లేయర్ గానూ రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు. ఇదిలా ఉంటే వరుసగా రెండు సెంచరీలతో తాను 2027 వరల్డ్ కప్ వరకు ఆడగలనని చాటి చెప్పాడు.



