Just Science and TechnologyLatest News

Li-Fi : మీకు వైఫై గురించి తెలుసు.. మరి లైఫై అంటే తెలుసా?

Li -Fi : ఆసుపత్రులు, విమానాలు వంటి రేడియో తరంగాలు ప్రమాదకరమైన చోట్ల కూడా లై-ఫై సేఫ్‌గా వాడుకోవచ్చు.

Li-Fi

మనం ప్రస్తుతం వాడుతున్న వై-ఫై (Wi-Fi) కి కాలం చెల్లిపోయే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయంటున్నారు టెక్ నిపుణులు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా లై-ఫై (Li-Fi) గురించి మాట్లాడుకుంటోంది. ఇంతకీ లైఫై అంటే ఏంటంటే లైట్ ఫిడిలిటీ. అంటే మనం రేడియో తరంగాల ద్వారా కాకుండా, కాంతి (Light) ద్వారా డేటాను పంపడం అన్నమాట.

మన ఇళ్లలో ఉండే మామూలు ఎల్‌ఈడీ (LED) బల్బులనే ఇంటర్నెట్ ప్రసార సాధనాలుగా మార్చడమే ఈ టెక్నాలజీ స్పెషాలిటీ. ఇది వై-ఫై కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ వేగంతో పనిచేస్తుందట. అంటే ఒక్క సెకనులో కొన్ని సినిమాలను డౌన్‌లోడ్ చేసేంత స్పీడ్ దీనిలో ఉంటుంది.

లై-ఫై (Li -Fi) పనిచేసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎల్‌ఈడీ బల్బులు అతి వేగంగా అంటే సెకనుకు లక్షల సార్లు వెలుగుతూ, ఆరిపోతూ ఉంటాయి. ఆ మార్పులను మన కళ్లు గమనించలేవు కానీ, స్మార్ట్‌ఫోన్‌లోని సెన్సార్లు మాత్రం దాన్ని గుర్తించి డేటాను గ్రహిస్తాయి.

Li-Fi
Li-Fi

దీనివల్ల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. సెక్యూరిటీ అనే చెప్పొచ్చు. మామూలు వై-ఫై సిగ్నల్ గోడలను దాటి వెళ్తుంది కాబట్టి ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ లై-ఫై(Li -Fi) వెలుతురు గోడ దాటి వెళ్లదు కాబట్టి మీ డేటా మీ గదిలోనే సేఫ్టీగా ఉంటుంది. అలాగే ఆసుపత్రులు, విమానాలు వంటి రేడియో తరంగాలు ప్రమాదకరమైన చోట్ల కూడా లై-ఫై(Li-Fi ) సేఫ్‌గా వాడుకోవచ్చు.

ఫ్యూచర్లో మన వీధి దీపాల ద్వారానే కార్లకు ఇంటర్నెట్ అందడం, ఆఫీసుల్లో ప్రతి బల్బు ఒక రౌటర్ లాగా పనిచేయడం వంటి మార్పులను మనం చూడబోతున్నాం. దీనికి ఎలక్ట్రికల్ బిల్ కూడా చాలా తక్కువ. కాంతి ద్వారానే కమ్యూనికేషన్ జరిగే ఈ విప్లవం మన డిజిటల్ ప్రపంచాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది.

Arava Sridhar:ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ నిందితుడా? అమాయకుడా? వారం రోజుల్లో నిజం తేలుతుందా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button