Arattai : మేడ్ ఇన్ ఇండియా Vs గ్లోబల్ టెక్..అరట్టై’ యాప్ .. ఫీచర్లేంటో పూర్తిగా తెలుసా?
Arattai యూజర్ డేటాను ఎటువంటి ప్రకటనలకు లేదా కమర్షియల్ డేటా సేలింగ్కు వాడరు. వాట్సాప్ (Meta/Facebook బృందం) మాత్రం డేటాను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించే అవకాశం ఉంది.
Arattai
ప్రపంచ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్‌కు పోటీగా భారతీయ టెక్ ప్రపంచంలో ‘అరట్టై’ (Arattai) అనే యాప్ వేగంగా వెలుగులోకి వస్తోంది. ఇది కేవలం మరో మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు, ‘మేడ్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో, మెరుగైన ప్రైవసీ , లోకల్ సర్వర్లతో దేశీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది.
సాంప్రదాయిక ఫీచర్ల విషయంలో వాట్సాప్, అరట్టై యాప్‌లు దాదాపు ఒకే విధంగా పనిచేస్తాయి. వీటిలో టెక్స్ట్ మెసేజింగ్, గ్రూప్‌లను సృష్టించడం, మీడియా షేరింగ్ (ఫొటోలు, వీడియోలు, ఆడియో, డాక్యుమెంట్లు), వాయిస్/వీడియో కాల్స్, స్టిక్కర్లు , తాత్కాలిక స్టేటస్/స్టోరీస్ వంటి సాధారణ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఛానల్స్, బ్రాడ్కాస్ట్ టూల్స్‌తో పాటు, మల్టీ-డివైస్ యాక్సెస్ (ఫోన్, కంప్యూటర్, ట్యాబ్లెట్లలో ఒకే ఖాతా వాడటం) సౌకర్యం రెండింటిలోనూ ఉంది.
అరట్టై(Arattai) యాప్‌ను వాట్సాప్ కంటే బెటర్ గా చూపించే ప్రధానాంశాలు దీని యొక్క డేటా విధానం , సాంకేతిక ఆప్టిమైజేషన్.
అరట్టై(Arattai) వినియోగదారుల డేటా పూర్తిగా భారతదేశంలోనే ఉన్న సర్వర్లలో నిల్వ చేయబడుతుంది. ఇది దేశీయ వినియోగదారులకు డిజిటల్ రక్షణ , డేటా స్వావలంబన విషయంలో భరోసా ఇస్తుంది.
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ యాప్ ప్రకటనల రహితంగా (Ad-Free) ఉంటుంది. యూజర్ డేటాను ఎటువంటి ప్రకటనలకు లేదా కమర్షియల్ డేటా సేలింగ్కు వాడరు. వాట్సాప్ (Meta/Facebook బృందం) మాత్రం డేటాను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించే అవకాశం ఉంది.
అరట్టై యాప్ పరిమాణం కేవలం 15-20 MB మాత్రమే ఉండి, బరువు తక్కువగా ఉంటుంది. దీని డిజైన్ లైట్‌వెయిట్‌గా ఉండటం వలన, తక్కువ-నాణ్యత గల ఫోన్లలో, మ2G/3G వంటి నెట్‌వర్క్‌లపైనా కూడా జాప్యం లేకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది బ్యాటరీని కూడా ఆదా చేస్తుంది.
సోషల్ టచ్..

- పాకెట్ (Pocket).. ఇది యూజర్‌కు సెల్ఫ్-చాట్ లాంటి స్టోరేజ్ ప్రాంతం. ఇక్కడ మీడియా, నోట్స్, లేదా రిమైండర్లను స్టోర్ చేసుకోవచ్చు.
- మీటింగ్స్ (Meetings).. అరట్టైలో నేరుగా వీడియో మీటింగ్స్‌ను ప్లాన్ చేసి, షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇది వాట్సాప్‌లో ప్యూర్ ఫీచర్‌గా అందుబాటులో లేదు.
- మెన్షన్స్ (Mentions).. గ్రూప్‌లలో మిమ్మల్ని ఎవరైనా ట్యాగ్ చేసినప్పుడు, వాటిని ప్రత్యేకంగా ‘Mentions’ ట్యాబ్‌లో నిర్వహించుకోవచ్చు, తద్వారా ముఖ్యమైన సందేశాలను మిస్ కాకుండా చూసుకోవచ్చు.
- మల్టీ-డివైస్ యాక్సెస్.. ఒకే ఖాతాను 5 డివైస్ల వరకు సులభంగా షేర్ చేసుకోవచ్చు.
- అరట్టై యాప్ ప్రైవసీ & డేటా సెక్యూరిటీకి మొదటి నుంచీ ప్రాధాన్యం ఇచ్చింది. వ్యక్తిగత కంట్రోల్.. లాస్ట్ సీన్, ప్రొఫైల్ పిక్, స్టేటస్ వంటి వాటిని “Everyone”, “My Contacts”, “Nobody” వంటి మూడు రకాల ఫిల్టర్లతో నియంత్రించవచ్చు.
- గ్రూప్ ప్రైవసీ.. మిమ్మల్ని గ్రూప్‌లలో యాడ్ చేసే ఆప్షన్‌ను కూడా My contacts except..లాంటి ఫిల్టర్లతో సెట్ చేసుకోవచ్చు, అనవసరమైన గ్రూప్‌లలో చేరడాన్ని నివారించవచ్చు.
- ఎన్క్రిప్షన్ & లాక్.. వాయిస్ , వీడియో కాల్స్‌కు పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. అంతేకాకుండా, యాప్‌ను పిన్/పాస్‌కోడ్/ బయోమెట్రిక్ లాక్ (ఫేస్ లాక్/ఫింగర్‌ప్రింట్)తో భద్రపరుచుకోవచ్చు.
- డిసప్పియర్ మెసేజ్‌లు.. టైమర్‌తో పంపిన మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే ‘డిసప్పియర్ మెసేజ్’, సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఇమేజ్/వీడియోలు పంపే సదుపాయం ఉంది.
- డేటా లొకేషన్.. అన్ని డేటా, కార్యకలాపాలు పూర్తిగా భారతదేశంలో, యూజర్ కంట్రోల్లోనే ఉండేలా డిజైన్ చేయబడింది.
అరట్టై యాప్ ముఖ్యంగా భారతీయ ప్రైవసీ లక్ష్యాలకు దగ్గరగా ఉంది. అడ్-ఫ్రీ విధానం, లో-ఎండ్ మార్కెట్ కోసం పూర్తిగా ఆప్టిమైజేషన్, Meetings, Pocket వంటి ప్రత్యేక ఫీచర్ల వల్ల వ్యక్తిగత వినియోగదారులకు, చిన్న కమ్యూనిటీలకు ఇది ఆకర్షణీయమైన చాట్ అనుభూతిని ఇస్తోంది. ‘మేడ్ ఇన్ ఇండియా–డిజిటల్ స్వావలంబన’ కోసం ప్రయత్నించదగిన యాప్ ఇది. ప్రస్తుతం మెసేజింగ్‌లో పూర్తి ఎన్క్రిప్షన్ అమలు ప్రక్రియలో ఉంది, వాట్సాప్‌కు ఉన్నంత గ్లోబల్ నెట్వర్క్ దీనికి లేకపోవడం ప్రస్తుతానికి దీని చిన్న పరిమితులు.



