Just Science and TechnologyJust LiteratureLatest News

WhatsApp Group:వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త అప్ డేట్..వారికి నిజంగానే గుడ్ న్యూస్

WhatsApp Group: పాత మెసేజ్‌లను మళ్లీ మళ్లీ ఫార్వార్డ్ చేయాల్సిన అవసరం లేకుండానే, కొత్త సభ్యుడు గ్రూప్‌లోని పరిస్థితులను త్వరగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

WhatsApp Group

వాట్సాప్ గ్రూప్‌లో కొత్తగా జాయిన్ అయినప్పుడు.. అంతకుముందు అక్కడ ఏం జరిగిందో తెలియక అసలు వీళ్లు దేని గురించి మాట్లాడుకుంటున్నారని తల గోక్కునే రోజులకు ఇక చెక్ పడనుంది. మన కన్ఫ్యూజన్‌ను దూరం చేసేలా వాట్సాప్ గ్రూప్(WhatsApp Group) మెసేజ్ హిస్టరీ (Group Message History) అనే అదిరిపోయే ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ టీమ్ తీసుకొచ్చిన ఈ అప్‌డేట్ ..గ్రూప్ చాటింగ్‌ను మరింత ఈజీగా మార్చుతుంది.

గతంలో ఎవరైనా ఏదైనా గ్రూప్‌లో కొత్తగా యాడ్ అయితే.. మనం చేరినప్పటి నుంచి వచ్చే మెసేజ్‌లు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు గ్రూప్ అడ్మిన్ అనుకుంటే.. మనం చేరకముందు జరిగిన చాట్‌లను కూడా చూసే వీలు కలుగుతుంది. దీనివల్ల పాత మెసేజ్‌లను మళ్లీ మళ్లీ ఫార్వార్డ్ చేయాల్సిన అవసరం లేకుండానే, కొత్త సభ్యుడు గ్రూప్‌లోని పరిస్థితులను త్వరగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

అయితే, పాత మెసేజ్‌లు చూపించాలా వద్దా అనేది పూర్తిగా గ్రూప్ అడ్మిన్ నిర్ణయంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. గ్రూప్ సెట్టింగ్స్‌లో దీనిని ఆన్ లేదా ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ కల్పించారు. అంతేకాదు, కనీసం గత 25 మెసేజ్‌ల నుంచి ఎంత వరకు హిస్టరీ చూపించాలో కూడా అడ్మిన్ సెట్ చేసే వీలుంటుంది. మొత్తంగా ఆఫీస్ గ్రూపులకైనా, ఫ్రెండ్స్ గ్యాంగ్‌కైనా ఇది చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది.

WhatsApp Group
WhatsApp Group

పాత మెసేజ్‌లు కనిపిస్తే మరి మా ప్రైవసీ దెబ్బతింటుందా? అని అనుకోవాల్సిన పని లేదట. ఎందుకంటే, ఈ మెసేజ్‌లు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తోనే భద్రపరచబడతాయి. అంటే గ్రూప్‌లోని వారు తప్ప మూడో వ్యక్తి లేదా వాట్సాప్ కూడా వీటిని చదవలేదు. ఇక పారదర్శకత కోసం, కొత్త సభ్యులకు పాత మెసేజ్‌లు షేర్ చేసినప్పుడు.. ఆ మెసేజ్ ఎప్పుడు పంపారు, ఎవరు పంపారనే వివరాలు టైమ్‌స్టాంప్‌తో సహా కనిపిస్తాయి. అవి పాత మెసేజ్‌లని క్లియర్గా తెలిసేలా ప్రత్యేకమైన డిజైన్‌తో ఉంటాయి.

ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ , ఐఓఎస్ (iOS) వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. మీరు కూడా ఈ ఫీచర్‌ను వాడాలనుకుంటే, వెంటనే మీ ప్లే స్టోర్ , యాప్ స్టోర్‌కు వెళ్లి వాట్సాప్‌(WhatsApp Group)ను అప్‌డేట్ చేసుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button