Claim Settlement:ఆన్‌లైన్‌లోనే డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్..నామినీలకు ఇక నో టెన్షన్
Claim Settlement : సేఫ్ డిపాజిట్ లాకర్ల క్లెయిమ్ ఆలస్యమైతే, రోజుకు రూ.5,000 చొప్పున ఎన్ని రోజులు లేటయితే అన్ని రోజులు జరిమానాను బ్యాంకు నామినీకి చెల్లించాల్సి ఉంటుంది.
Claim Settlement
కుటుంబంలో ఎవరైనా చనిపోయిన తర్వాత వారి అకౌంట్లో ఉన్న డబ్బులు అలాగే ఉండిపోతాయి. దీనికోసం బ్యాంకుకు వెళ్లినా కూడా డాక్యుమెంట్ల పేరుతో, సర్టిఫికెట్ల పేరుతో నెలల తరబడి తిప్పుతూ ఉంటారు. దీంతో చాలామంది ఆ అకౌంట్లలో ఉన్న చిన్న చిన్న మొత్తాలను వదిలేస్తుంటారు. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.
మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లేదా లాకర్‌లోని డబ్బును వారసులు ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ఇప్పటికే.. ప్రత్యేక పోర్టల్‌నుక కూడా ప్రారంభించి మిగిలిన బ్యాంకులకు ఆదర్శంగా నిలిచింది.
ఆర్‌బీఐ విడుదల చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం, వారసులు క్లెయిమ్ దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు సెటిల్‌మెంట్(Claim Settlement )(Claim Settlement )పూర్తి కావాలి. ఒకవేళ బ్యాంకు నిర్లక్ష్యం వల్ల కనుక ఈ ప్రాసెస్ ఆలస్యమైతే, ఆ బ్యాంకు వారసులకు భారీగానే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
డబ్బుల విషయంలో సెటిల్‌మెంట్ ఆలస్యమైతే కనీసం 4% వడ్డీతో కలిపి చెల్లించాలి.అదే సేఫ్ డిపాజిట్ లాకర్ల క్లెయిమ్ ఆలస్యమైతే, రోజుకు రూ.5,000 చొప్పున ఎన్ని రోజులు లేటయితే అన్ని రోజులు జరిమానాను బ్యాంకు నామినీకి చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు రూ.15 లక్షల వరకు క్లెయిమ్ చేయడానికి ఎటువంటి థర్డ్ పార్టీ ష్యూరిటీ కూడా అవసరం లేదని ఐఓబీ స్పష్టం చేసింది.

దీనికోసం బ్యాంకు వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ పోర్టల్ ద్వారా వారసులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. నామినీ స్వయంగా అప్లై చేసినట్లయితే అకౌంట్ హెల్డర్ డెత్ సర్టిఫికెట్, నామినీ ఐడీ ప్రూఫ్ అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.
ఒక్కోసారి అకౌంట్ హోల్డర్ నామినీ పేరును అప్ డేట్ చేయరు. అలాంటి సమయంలో వారసత్వ ధ్రువీకరణ పత్రం (Legal Heir Certificate) వంటి అదనపు పత్రాలు అవసరం పడతాయి. 2026 మార్చి 31 నాటికి దేశంలోని అన్ని బ్యాంకులు కూడా ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ గడువు విధించింది.
ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు బ్యాంకుల చుట్టూ తిరిగే పని తగ్గడమే కాకుండా ట్రాన్సఫరెన్సీ పెరుగుతుంది. పెద్ద మొత్తంలో డబ్బులు బ్యాంకులో ఉన్నప్పుడు నామినీలు ఇబ్బంది పడకుండా, వెంటనే ఆ సొమ్మును పొందే అవకాశం ఉంటుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇలాంటి పోర్టల్‌ను ప్రారంభించగా, అతి త్వరలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రధాన బ్యాంకులు కూడా ఇదే బాటలో పయనించనున్నాయి.



