Smart glasses: స్మార్ట్ గ్లాసెస్.. టెక్ ప్రపంచంలో ఒక సైలెంట్ రివల్యూషన్
Smart glasses: ఒకసారి ఛార్జ్ చేస్తే 9 గంటల పాటు పనిచేస్తాయి, కేవలం 20 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది.

Smart glasses
మన జీవితంలో టెక్నాలజీ ఒక భాగమైపోయింది. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ తరువాత ఇప్పుడు స్మార్ట్ గ్లాసెస్(Smart glasses) మన ముందుకు వచ్చాయి. ఇవి కేవలం కళ్లద్దాలు కాదు, చేతులు ఉపయోగించకుండానే మన డిజిటల్ ప్రపంచాన్ని నియంత్రించగలిగే ఒక అద్భుతమైన సాధనం. ఈ చిన్న గాడ్జెట్‌లు, మనం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చేస్తాయి.
ఈ టెక్నాలజీలో ప్రస్తుతం రెండు రకాలు ఉన్నాయి. ఇవి స్టైల్, ఫ్యాషన్‌కు ప్రాధాన్యత ఇస్తూ, కెమెరా, మైక్రోఫోన్, స్పీకర్‌లను అందిస్తాయి. ఇవి సోషల్ మీడియా, ఫోటోగ్రఫీ వంటి వాటికి ఎక్కువగా ఉపయోగపడతాయి. మరొకటి, ఓక్లే మెటా లాంటివి. ఇవి స్పోర్ట్స్, ఫిట్‌నెస్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడతాయి. వీటిలో ఎక్కువ బ్యాటరీ లైఫ్, IP రేటింగ్ వంటివి ఉంటాయి.
వీటిలో 3కే వీడియో రికార్డింగ్ చేయగల 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఐదు మైక్రోఫోన్‌లు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 9 గంటల పాటు పనిచేస్తాయి, కేవలం 20 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది. వీటిలో IP67 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటం వల్ల వర్షంలో, చెమట పట్టే సమయంలో కూడా సురక్షితంగా ఉంటాయి. వీటిని స్మార్ట్ వాచ్‌లకు, ఫిట్‌నెస్ వాచ్‌లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వీటి ధర సుమారు రూ.45,000 ఉంటుంది.

రేబాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్(Smart glasses) ..ప్రస్తుత ట్రెండ్‌లో ఈ గ్లాసెస్ ముందున్నాయి. దీనిలో 5 MP కెమెరాలు ఉన్నాయి, ఇవి 500 ఫోటోలు, 35 వీడియోలను నిల్వ చేయగలవు. దీనికి ప్రత్యేకమైన ఫేస్‌బుక్ వ్యూ యాప్ ఉంది, దీని ద్వారా మనం తీసిన ఫోటోలు, వీడియోలను సులభంగా షేర్ చేయవచ్చు. ఇది ఒకరకంగా మన వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ లా పనిచేస్తుంది. రేబాన్ స్టైల్, మెటా టెక్నాలజీ కలిసిన ఈ ఉత్పత్తికి ధర సుమారు రూ. 29,000 ఉంటుంది.
నాయిస్ ఐ1 స్మార్ట్ గ్లాసెస్(Smart glasses)..టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో వచ్చినవే నాయిస్ ఐ1 గ్లాసెస్. ఇవి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందిస్తాయి. దీనిలో 16.2 mm ఆడియో డ్రైవర్ ఉంది, దీని ద్వారా మంచి క్వాలిటీతో పాటలు వినవచ్చు. ఇది వాయిస్ కమాండ్స్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వర్షం, చెమట పట్టే సమయంలో ఉపయోగించేందుకు దీనిలో IPX4 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. కేవలం రూ.2,000 ధరలో ఇన్ని ఫీచర్స్ ఉండటం విశేషం.
ఈ స్మార్ట్ గ్లాసెస్ మన జీవితాలను వేగవంతం చేస్తాయి. భవిష్యత్తులో ఈ గ్లాసెస్ మరింత అధునాతనంగా మారి, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) వంటి ఫీచర్లతో మన ముందుకు రావచ్చు. ఈ స్మార్ట్ గ్లాసెస్ సాంకేతిక విప్లవంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయి.