Muthoot
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ అయిన ముత్తూట్(Muthoot) గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) జార్జ్ అలెగ్జాండర్ మూతూట్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసులో విచారణ చేపట్టింది. కేరళ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈడీ ఈ కేసును నమోదు చేసింది. ఈ దర్యాప్తు కారణంగా ముత్తూట్ గ్రూప్ ప్రతిష్ఠ , పెట్టుబడిదారుల నమ్మకంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రధాన ఆరోపణలు, నిధుల మళ్లింపు..
- జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్(Muthoot)పై ప్రధానంగా ఉన్న ఆరోపణలు ఆర్థికపరమైన అక్రమాలకు సంబంధించినవి.
- నిధుల సేకరణ.. పెట్టుబడిదారులకు 8-12 శాతం వడ్డీని హామీ ఇస్తూ, ఫిక్స్డ్ డిపాజిట్లు , నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDs) రూపంలో ప్రజల నుంచి నిధులు సేకరించారు.
- అక్రమ మళ్లింపు.. ఈ సేకరించిన నిధులను, తప్పుగా సిస్టర్ కన్సర్న్గా చూపిన స్రై ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే సంస్థకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ.
- మనీలాండరింగ్ అనుమానాలు.. ఈ నిధుల మళ్లింపు ప్రక్రియలో షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ జరిగిందనే అనుమానాలను ఈడీ వ్యక్తం చేస్తోంది.
- ఈ ఆరోపణల నేపథ్యంలో, ఈడీ అధికారులు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ కీలక అధికారుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు (Searches) నిర్వహించారు.
- ఈ దర్యాప్తులో భాగంగా, ఈడీ అధికారులు జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్కు సమన్లు జారీ చేసి, కొచ్చిలోని సంస్థ కార్యాలయంలో ఆయన వాంగ్మూలం (Statement) నమోదు చేశారు.
Muthoot - మరోవైపు, ఈ ఆర్థిక అక్రమాల ఆరోపణల కారణంగా డిపాజిట్ల గడువు పూర్తయినా చెల్లింపులు జరగకపోవడం, పెట్టుబడిదారులకు భారీ నష్టాలు వాటిల్లడంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఈడీకి అందాయి. ఈ పరిణామాలలో, ఈడీ తమ దర్యాప్తును కొనసాగిస్తోంది.
- ఈ విచారణ కారణంగా సంస్థపై ప్రతికూల వాతావరణం నెలకొన్నా ముత్తూట్ గ్రూప్ తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
- ఈ పరిణామాల మధ్యే, సంస్థకు చెందిన మూతూట్ మైక్రోఫిన్ కంపెనీ, ప్రైవేట్ బాండ్ ప్లేస్మెంట్ ద్వారా 36 నెలల గడువుతో $15 మిలియన్ (సుమారు రూ.125 కోట్లు) నిధులను సమీకరించినట్లు ప్రకటించింది.
- సంస్థ తమ మూలధనాన్ని బలోపేతం చేసుకునేందుకు, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకునేందుకు ఈ నిధులను ఉపయోగించాలని యోచిస్తోంది. ఈడీ దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే ఈ కేసులో తుది నివేదిక వెలువడనుంది.