Just TelanganaJust PoliticalLatest News

Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేట్‌చార్జ్..అభ్యర్థులకు ఈసీ షాక్!

Election: ఎన్నికల అధికారులు ప్రచారానికి అయ్యే ఖర్చులకు సంబంధించి ఒక వివరమైన ధరల పట్టికను (రేట్‌చార్జ్) విడుదల చేశారు.

Election

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికల (Election)సమయంలో, అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చుల విషయంలో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఎన్నికల(Election) అధికారులు ప్రచారానికి అయ్యే ఖర్చులకు సంబంధించి ఒక వివరమైన ధరల పట్టికను (రేట్‌చార్జ్) విడుదల చేశారు.

ఉపఎన్నిక (Election)షెడ్యూల్

నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.అక్టోబర్ 13న నోటిఫికేషన్ రానుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తుండగా, బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది.

నిజానికి, ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు కోట్లలో ఉన్నా కూడా, ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి రూ.40 లక్షలు మించకూడదు. అభ్యర్థులు తాము ఎంత ఖర్చు చేసినా, అధికారిక లెక్కలు మాత్రం ఈ పరిమితి లోబడే ఉండాలి. అందుకే, ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) ప్రకారం అభ్యర్థులు రోజువారీగా ఖర్చులను చూపించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈసీ హెచ్చరించింది.

Election
Election

ప్రచారం ఖర్చుల రేట్‌చార్జ్ వివరాలు..ఈసీ విడుదల చేసిన రేట్‌చార్ట్‌లో ప్రచారానికి ఉపయోగించే ప్రతి వస్తువు, సేవకు ధరలను నిర్ణయించారు. ఇది అభ్యర్థులు తమ ఖర్చులను లెక్క చూపడానికి ప్రామాణికంగా పనిచేస్తుంది.

వస్తువు/సేవ యూనిట్ నిర్ణీత ధర (రూ.)

  • టిఫిన్ ప్లేట్ ఇడ్లీ (4) రూ.20
  • వడ ప్లేట్ (2) రూ.20
  • లఘు ఆహారం ఒక ఆలూ సమోసా రూ.10
  • పులిహోర (300 గ్రాములు) రూ.40
  • భోజనం వెజ్ మీల్స్ (సింగిల్) రూ.80
  • వెజ్ బిర్యానీ (750 గ్రాములు) రూ.115
  • ఎగ్ బిర్యానీ (750 గ్రాములు) రూ.135
  • చికెన్ బిర్యానీ (750 గ్రాములు) రూ.170
  • మటన్ బిర్యానీ (750 గ్రాములు) రూ.180
  • వెజ్ ఫ్రైడ్ రైస్ (750 గ్రాములు) రూ.90
  • పానీయాలు సింగిల్ టీ రూ.5
  • పెద్ద కప్పులో టీ రూ.10
  • సింగిల్ కాఫీ రూ.6
  • పెద్ద కప్పులో కాఫీ రూ.11
  • నీరు వాటర్ ప్యాకెట్ (ఒకటి) రూ.2
  • 200 మిల్లీ లీటర్ల బాటిల్ రూ.6
  • 500 మిల్లీలీటర్ల బాటిల్ రూ.10
  • లీటర్ వాటర్ బాటిల్ రూ.20
  • ప్రదేశాలు, సేవలు డ్రోన్ కెమెరా (12 గంటలు) రూ.5,000
  • మినీ ఫంక్షన్ హాల్ (రోజుకు) రూ.6,200
  • పెద్ద ఫంక్షన్ హాల్ (రోజుకు) రూ.62,000
  • ఏసీ ఫంక్షన్ హాల్ (రోజుకు) రూ.1,25,000
  • ఫోటోగ్రాఫర్ (రోజుకు) రూ.1,500

వీటితో పాటు, సౌండ్ బాక్సులు, కుర్చీలు, పేపర్ ప్లేట్లు, టీషర్టులు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు వంటి ప్రచార సామగ్రికి కూడా ఈసీ ప్రత్యేక ధరలను నిర్ణయించింది. ఈ నిబంధనలు అభ్యర్థులు చేసే ఖర్చులో పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించినవి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button