Messi: హైదరాబాద్‌లో మెస్సీ మ్యాజిక్..గోట్ కప్ 2025 లో రేవంత్ రెడ్డి ఎంట్రీపై ఫుల్ హైప్
Messi: మూడు రోజుల పాటు భారత్‌లో ఉండనున్న మెస్సీ.. కోల్‌కతాతో పాటు హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో పర్యటించనున్నాడు.
Messi
భారత ఫుట్‌బాల్ (Football) ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సమయం ఆసన్నమైంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత్ పర్యటనకు వచ్చాడు. గోట్ టూర్ ఆఫ్ ఇండియా పేరుతో సాగనున్న ఈ పర్యటనలో భాగంగా అతను శనివారం తెల్లవారుజామున కోల్‌కతాలో (Kolkata) అడుగుపెట్టాడు. 2011 తర్వాత మెస్సీ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
మూడు రోజుల పాటు భారత్‌లో ఉండనున్న మెస్సీ(Messi).. కోల్‌కతాతో పాటు హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో పర్యటించనున్నాడు. మెస్సీతో పాటు అతని ఇంటర్ మియామీ జట్టు సహచర ఆటగాళ్లు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్‌లు కూడా వస్తున్నారు. మెస్సీ ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలెబ్రీటీలను కూడా కలవనున్నాడు.

శనివారం కోల్‌కతాలో తన పర్యటన ముగియగానే మెస్సీ హైదరాబాద్‌కు రానున్నాడు. ఆ తర్వాత గోట్ కప్ (Goat Cup) పేరుతో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ (Exhibition Football Match) ఆడుతాడు. ఈ మ్యాచ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ మ్యాచ్‌కి ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల జట్టుకు రేవంత్ రెడ్డి సారథ్యం (Captaincy) వహించనున్నారు.
ఈ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి రెండు-మూడు వారాలు ప్రాక్టీస్ కూడా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
దీంతో ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి ఆటను చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ డీడీ స్పోర్ట్స్ (DD Sports)తో పాటు సోనీ లైవ్ (Sony LIV) ఓటీటీ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డీడీ స్పోర్ట్స్‌లో మెస్సీ పర్యటనను ఉచితంగా చూడొచ్చు.
సోనీ లైవ్ యాప్‌ను మాత్రం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. జియో ప్రత్యేకమైన రిఛార్జ్ ప్లాన్‌తో సోనీ లివ్ యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం కూడా ఉంది.
మొత్తంగా మెస్సీ పర్యటన, సీఎం రేవంత్ రెడ్డి ఆటతో హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ఫీవర్ పీక్స్‌కి చేరింది.



