Nidhi Agarwal incident
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో ఉన్న లులు మాల్‌లో తాజాగా జరిగిన ‘ద రాజాసాబ్’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ ఎంతటి రచ్చకు దారితీసిందో మనందరం చూశాం. హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal incident)ను అభిమానులు, జనం ఒక్కసారిగా చుట్టుముట్టడం, ఆమె(Nidhi Agarwal incident)ను తాకడానికి ప్రయత్నించడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా ఒక మహిళా సెలబ్రిటీకి కనీస రక్షణ కల్పించలేకపోయారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి మాల్ యాజమాన్యం , ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.
పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో ప్రధానంగా రెండు వర్గాలను నిందితులుగా చేర్చారు. ఒకటి లులు మాల్ మేనేజ్‌మెంట్, రెండు ఈవెంట్‌ను నిర్వహించిన శ్రేయాస్ మీడియా. ఈ స్థాయి సెలబ్రిటీ వస్తున్నప్పుడు , భారీగా జనం వచ్చే అవకాశం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను వీరు విస్మరించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి హై-ప్రొఫైల్ ఈవెంట్‌లు నిర్వహించేటప్పుడు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి (NOC) తీసుకోవడం తప్పనిసరి అని, కానీ ఈ ప్రోగ్రాం కోసం ఎటువంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టంగా చెప్పారు. అంటే నిబంధనలను అతిక్రమించి ఈవెంట్ నిర్వహించడం ద్వారా వీరు చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు.
ముఖ్యంగా ఈ కేసులో ‘పబ్లిక్ న్యూసెన్స్’ , ‘నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించడం’ వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. సెక్షన్ 290 , 336 వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఒక పబ్లిక్ ప్లేస్‌లో ఇంత మంది జనాన్ని పిలిచినప్పుడు, వారిని కంట్రోల్ చేయడానికి బారికేడ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు?
సెలబ్రిటీ కారు వరకు వెళ్లడానికి ఒక సేఫ్ కారిడార్‌ను ఎందుకు ప్లాన్ చేయలేదు? మహిళా సెలబ్రిటీకి వ్యక్తిగత భద్రత , ప్రత్యేక రూట్ ఎందుకు కేటాయించలేదు? అనే ప్రశ్నలను పోలీసులు సంధిస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల నిధి అగర్వాల్ భద్రతకు మాత్రమే కాకుండా, అక్కడ ఉన్న సామాన్య ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లిందని పోలీసులు భావిస్తున్నారు.
ప్రస్తుతం దర్యాప్తులో భాగంగా పోలీసులు మాల్‌లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శ్రేయాస్ మీడియా ప్రతినిధులను, మాల్ సెక్యూరిటీ స్టాఫ్‌ను పిలిపించి స్టేట్‌మెంట్లు తీసుకుంటున్నారు. లీగల్ గా అనుమతులు ఎందుకు తీసుకోలేదు? సెక్యూరిటీ ప్లాన్ ఏంటి? అనే విషయాలపై వివరణ కోరుతున్నారు.
వైరల్ వీడియోల్లో నిధి అగర్వాల్ (Nidhi Agarwal incident)పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారు ఎవరు? అనే కోణంలో కూడా గుర్తింపు ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటన కేవలం ఒక సెలబ్రిటీ సమస్య మాత్రమే కాదు, పబ్లిక్ ఈవెంట్లలో మహిళల రక్షణకు సంబంధించిన పెద్ద ప్రశ్నగా మారింది. పోలీసుల ఈ ‘సుమోటో’ చర్య భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్‌లు చేసే నిర్వాహకులకు ఒక గట్టి హెచ్చరికలా నిలుస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు.
