Haunted Places: తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ తెలుసా? వాటి వెనుక ఉన్న కథలేంటి?

Haunted Places: పగలంతా పర్యాటకులతో కళకళలాడుతూ, చీకటి పడితే మాత్రం నిశ్శబ్దంగా, భయానకంగా మారిపోతాయి.

Haunted Places

దెయ్యాలు ఉన్నాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే, కొన్ని ప్రదేశాల పేరు వింటే మనకు తెలియకుండానే వెన్నులో వణుకు పుడుతుంది. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అడుగు పెట్టడానికే భయపడే కొన్ని ఇలాంటి భయంకరమైన ప్రదేశాలు(Haunted Places) ఉన్నాయి. పగలంతా పర్యాటకులతో కళకళలాడే ఈ ప్రదేశాలు, చీకటి పడితే మాత్రం నిశ్శబ్దంగా, భయానకంగా మారిపోతాయి.

గోల్కొండ కోట, హైదరాబాద్.. మన చారిత్రక సంపద అయిన గోల్కొండ కోట ఉదయం పూట ఎంత అందంగా ఉంటుందో రాత్రి పూట ఎంతో భయానకంగా ఉంటుందని స్థానికులు కథలుకథలుగా చెబుతారు. రాజుల కాలంలో జరిగిన హత్యలు, కుట్రల వల్ల ఇంకా ఇక్కడ ఆత్మలు తిరుగుతుంటాయని స్థానికుల నమ్ముతారు. ముఖ్యంగా తారామతి అనే నర్తకి ఆత్మ..గోల్కొండ కోటలో పాడుబడిన కట్టడాల మధ్య రోజూ రాత్రి నృత్యం చేస్తూ ఉంటుందని, ఆమె కాలి గజ్జెల శబ్దం స్పష్టంగా వినిపిస్తుందని అంటుంటారు. అందుకే సాయంత్రం 6 గంటలు దాటాక కోట లోపలికి ఎవరినీ అనుమతించరు.

golkonda-Haunted Places

రామోజీ ఫిలిం సిటీ.. విలాసవంతమైన సెట్టింగులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామోజీ ఫిలిం సిటీ కూడా హాంటెడ్ ప్లేసెస్ లిస్టులో ఉందన్న విషయం చాలామందికి తెలీదు. ఈ ప్రదేశం నిజాం కాలంలో యుద్ధ భూమిగా ఉండేదని, ఇక్కడ వేల సంఖ్యలో సైనికులను బలవంతాన చంపారని చెబుతారు. షూటింగ్ సమయాల్లో లైట్లు వాటంతట అవే ఆరిపోవడం, మిర్రర్స్ మీద వింత రాతలు కనిపించడం, పై నుంచి ఎవరో నెట్టేసినట్లు అనిపించడం వంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయట. ముఖ్యంగా హోటళ్లలో బస చేసే వారు వింతవింత శబ్దాలు వింటుంటారని ప్రచారం కూడా ఉంది. అంతెందుకు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ కూడా తాను రామోజీ ఫిలింసిటీలో దెయ్యం వేధించిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ కూడా అయింది అప్పుడు.

ramoji-Haunted Places

కుందన్ బాగ్ హౌస్, హైదరాబాద్..హైదరాబాద్ నడిబొడ్డున ఉండే కుందన్ బాగ్ లోని ఒక పాత బంగళా గురించి భయంకరమైన రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ ఒక తల్లి, ఇద్దరు కూతుళ్లు ఉండేవాళ్లని, వారు మంత్రతంత్రాలు చేస్తూ వింతగా ప్రవర్తించేవాళ్లని చుట్టుపక్కల వారు అంటారు. వారు చనిపోయిన మూడు నెలల వరకు ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియలేదట. ఇప్పటికీ ఆ పాడుబడిన ఇంట్లో అర్థరాత్రి వేళ ఎవరో కొవ్వొత్తులు పట్టుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తాయని చుట్టుపక్కల వారు చెబుతుంటారు.

kundan-bagh-house-Haunted Places (1)

చంద్రగిరి కోట, తిరుపతి..చిత్తూరు జిల్లాలోని ఈ ప్రాచీన కోట అయిన చంద్రగిరి కోటలో కూడా కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నట్లు ప్రచారం ఉంది. రాజుల కాలంలో దోషులుగా తేలిన వారికి ఇక్కడే శిక్షలు అమలు చేసేవారని, అందుకే వారి ఆత్మలు ఇప్పటికీ అక్కడ తిరుగుతున్నాయని స్థానికులు నమ్ముతారు. చీకటి పడ్డాక ఇక్కడ ఎవరో ఏడుస్తున్నట్లు, గొలుసులతో నడుస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయని చెబుతుంటారు.

chandragiri-kota-Haunted Places

ఈ కథలన్నీ నిజమా కాదా అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ చరిత్రలో ఉన్న కొన్ని సంఘటనలు ఈ ప్రదేశాలకు ఒక మిస్టరీని జోడించాయి. సాహసం చేయాలనుకునే వారు ఈ ప్రదేశాల(Haunted Places)ను సందర్శిస్తారు కానీ ఇప్పటి వరకూ ఎవరూ ఒంటరిగా వెళ్లలేదు. తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన ప్రదేశాలు, గోల్కొండ కోట రహస్యాలు, కుందన్ బాగ్ దెయ్యాల ఇల్లు నిజానిజాలు.

Munnar:మున్నార్ ..మంచు మేఘాల మధ్య పచ్చని టీ తోటల అందాలు చూశారా?

Exit mobile version