Traffic:హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు

Traffic
సంక్రాంతి పండుగ సంబరాలు ముగించుకుని తిరిగి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికులకు నల్గొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65)పై ప్రస్తుతం చిట్యాల, పెద్ద కాపర్తి సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
వాహనాల రద్దీ తిరిగి ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్(Traffic) స్తంభించే అవకాశం ఉంది. దీంతో వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రకటించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఈ క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.
మళ్లించిన రూట్ల వివరాలు ఇవే..
గుంటూరు నుంచి వచ్చే వారు- గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా ప్రయాణించి నగరం చేరుకోవచ్చు.
మాచర్ల, సాగర్ వైపు నుంచి వచ్చేవారు- మాచర్ల లేదా నాగార్జున సాగర్ నుంచి వచ్చే వాహనాలు పెద్దవూర, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది.
నల్గొండ నగరం నుంచి బయలుదేరే వారు- నల్గొండ నుంచి వెళ్లే వాహనాలు మర్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ చేరుకుని, అక్కడ నుంచి జాతీయ రహదారి 65 పైకి వెళ్లవచ్చు.

భారీ వాహనాల కోసం (విజయవాడ రూట్)- విజయవాడ నుంచి వచ్చే లారీలు, ఇతర భారీ వాహనాలను కోదాడ వద్ద హుజూర్నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా మళ్లిస్తున్నారు.
ఒకవేళ చిట్యాల వద్ద ట్రాఫిక్ జామ్(Traffic) మరీ ఎక్కువగా ఉంటే, వాహనాలను చిట్యాల నుంచి భువనగిరి వైపు మళ్లించి, అక్కడి నుండి హైదరాబాద్కు పంపిస్తామని పోలీసులు తెలిపారు.
ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల ప్రయాణం ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో..పైన పేర్కొన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీస్ శాఖ కోరుతోంది.
Traffic:హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు


