Crop:చిన్న గదిలోనే పంటలు పండించొచ్చు.. లక్షలు సంపాదించే స్మార్ట్ బిజినెస్ ఐడియా!
Crop : భూమి లేని వారు, నగరాల్లో చిన్న ఇళ్లలో ఉండేవారు కూడా ఒక పొలం యజమానిగా మారొచ్చు.
Crop
పెరుగుతున్న పట్టణీకరణ వల్ల సాగు భూమి తగ్గిపోతోంది, కానీ ఆహార అవసరాలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన అద్భుతమైన వ్యవసాయ పద్ధతే ‘వర్టికల్ ఫార్మింగ్’ లేదా నిలువు వ్యవసాయం(Crop). అసలు భూమి లేని వారు, నగరాల్లో చిన్న ఇళ్లలో ఉండేవారు కూడా ఒక పొలం యజమానిగా మారొచ్చు.
కాకపోతే ఈ పద్ధతిలో పంటలను మట్టిలో కాకుండా, ఒకదానిపై ఒకటి ఉండే అరల (Racks) లో పండిస్తారు. ఇందులో ముఖ్యంగా ‘హైడ్రోపోనిక్స్’ (Hydroponics) టెక్నాలజీని వాడతారు. అంటే మొక్కలకు మట్టి అవసరం లేదు, కేవలం పోషకాలు కలిపిన నీటితోనే అవి ఏపుగా పెరుగుతాయి.
మీ ఇంట్లోని ఒక చిన్న గదిలో లేదా బాల్కనీలో ఈ సెటప్ చేసుకుని లెట్యూస్, బ్రోకలీ, చెర్రీ. టమోటాలు, స్ట్రాబెర్రీలు వంటి పండ్లను, కూరగాయలను పండించొచ్చు. ఈ కూరగాయలకు, పండ్లకు మార్కెట్లో, ముఖ్యంగా ఫైవ్ స్టార్ హోటల్స్ , ఆర్గానిక్ స్టోర్స్ లో విపరీతమైన డిమాండ్ ఉంది.

వర్టికల్ ఫార్మింగ్ వల్ల కలిగే లాభాలు వింటే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణ వ్యవసాయంతో పోలిస్తే ఇందులో నీటి వాడకం 90 శాతం వరకు తగ్గుతుందట. అంతేకాకుండా, పంట(Crop)లకు ఎటువంటి పురుగుమందుల అవసరం ఉండదు. ఎందుకంటే ఇవి ఒక నియంత్రిత వాతావరణంలో పెరుగుతాయి.
అందుకే దీనివల్ల ఏడాది పొడవునా, వాతావరణంతో సంబంధమే లేకుండా మనం పంటలు (Crop)పండించొచ్చు. ఒక ఎకరం భూమిలో వచ్చే దిగుబడిని కేవలం వంద అడుగుల గదిలో సాధించొచ్చు. నేటి కాలంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా తమ వీకెండ్ లో ఇలాంటి స్మార్ట్ ఫార్మింగ్ వైపు ఇంట్రస్ట్ చూపిస్తున్నారట.
దీనికి కొంచెం పెట్టుబడి అవసరమైనా కూడా, దిగుబడి వచ్చిన తర్వాత లాభాలు మాత్రం లక్షల్లో ఉంటాయి. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, పర్యావరణాన్ని రక్షిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే ఒక గొప్ప సామాజిక బాధ్యత కూడా .అందుకే మరో రెండు, మూడేళ్లలో నగరాల్లో ప్రతి ఇంట్లో ఒక చిన్న వర్టికల్ ఫార్మ్ ఉండటం అనేది ఒక సాధారణ విషయంగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు.



